Kondapalli-Fort-Forest-Trecking-Jan-2019

Kondapalli-Fort-Forest-Trecking-January-2019

Eenadu-amaravati-logo

శనివారం, డిసెంబర్ 22, 2018

అడవిలో.. సాహస వేడుక

జనవరి 27, 28 తేదీల్లో వేడుక
తరలిరానున్న దేశ, విదేశాల క్రీడాకారులు
కొండపల్లి కోట, అటవీ ప్రాంతంలో నిర్వహణ
ఈనాడు, అమరావతి

Kondapalli Forest Trecking Photos 01 Eenadu 22-12-2018

అమరావతి రాజధాని ప్రాంతం మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కాబోతోంది. నీటిలో బోట్‌ రేసింగ్‌, గాలిలో ఎయిర్‌షోలను నిర్వహించిన కృష్ణా జిల్లా యంత్రాంగం తాజాగా.. అటవీ ప్రాంతంలో మరో అంతర్జాతీయ వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ‘కొండపల్లి అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ 2018’ పేరుతో జనవరి 27, 28 రెండు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కొండపల్లి అటవీ ప్రాంతం, కోట, చుట్టుపక్కల ఉండే అద్భుత ప్రకృతి వనరులను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. పర్యాటక, అటవీశాఖలు సహకారం అందిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటూ విదేశాల నుంచి సైతం ఈ సాహస వేడుకలో పాల్గొనేందుకు ప్రకృతి ప్రేమికులు, క్రీడాభిమానులు తరలిరానున్నారు. పెద్దవాళ్లతో పాటూ చిన్నారుల కోసం ప్రత్యేకంగా 13 రకాల సాహస క్రీడలు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రీడా పోటీలన్నీ ఏక కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిపుణుల సారథ్యంలో అటవీ ప్రాంతంలో వేర్వేరుగా జరగనున్నాయి.

రసవత్తరంగా పోటీలు..
కొండపల్లి సాహస వేడుకల్లో భాగంగా దేశవిదేశాల నుంచి తరలివచ్చే వారికి పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలు పెద్దలు, పిల్లలకు వేర్వేరుగా ఉంటాయి. ప్రధానంగా ప్రకృతిని భాగస్వామ్యం చేసేలా, శారీరక, మానసిక సంబంధిత క్రీడలను నిర్వహిస్తున్నారు. ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌, రాప్లింగ్‌, జుమెరింగ్‌, జిప్‌లైన్‌, జోర్బింగ్‌, ఆర్చరీ, కమాండో నెట్‌, బుర్మాబ్రిడ్జ్‌, ట్రెజర్‌హంట్‌, స్లాక్‌లైన్‌ వంటి సాహస క్రీడల్లో అంతర్జాతీయస్థాయి పోటీలను నిర్వహిస్తున్నారు. వీటికితోడు.. చిన్నారుల కోసం క్విజ్‌, ప్రకృతిపై చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు, జ్ఞాపికలను ప్రదానం చేయనున్నారు.

సోమవారం నుంచి దరఖాస్తులు..
జనవరి 10వ తేదీలోగా ఈ పోటీలలో పాల్గొనే వారు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కచ్చితంగా భాగస్వామ్యం ఉండేలా ఆహ్వానిస్తున్నారు. విదేశాల నుంచి సైతం ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని యూత్‌ హాస్టల్స్‌ విజయవాడ ఛైర్మన్‌ నందం విష్ణువర్ధన్‌ వెల్లడించారు.

మూలపాడులో బేస్‌క్యాంప్‌..
కొండపల్లి కోట, మూలపాడు అటవీ ప్రాంతాలు వేదికగా ఈ సాహక పండుగ జరుగుతుంది. కొండపల్లి కోట వద్ద రాక్‌క్లైంబింగ్‌, రాఫ్లింగ్‌, జుమ్మెరింగ్‌, జిప్‌లైన్‌ లాంటి సాహస క్రీడలను నిర్వహిస్తారు. మూలపాడు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌, ఆర్చరీ, కమాండో నెట్‌, ట్రెజర్‌ హంట్‌, స్లాక్‌లైన్‌, చిత్రలేఖనం వంటి పోటీలు జరుగుతాయి. మూలపాడు క్రికెట్‌ స్టేడియం సమీపంలో అడవిని ఆనుకుని ఉండే విశాలమైన ప్రదేశంలో బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. 500 మందికి సరిపడేలా టెంట్‌లు, ఆహారం, వసతులను ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. ఒక రాత్రి కూడా ఇక్కడే బస చేయనున్నారు.

చిత్రలేఖనం పోటీలు..
చిన్నారులు, పెద్దలు అందరూ పాల్గొనేలా చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నారు. మూలపాడులోని బేస్‌ క్యాంప్‌ వద్ద ఈ పోటీలు జరుగుతాయి. ప్రకృతిని చూస్తూ.. వారికి కనిపించిన దృశ్యాలను స్పాట్‌ పెయింటింగ్‌గా వేయాలి. ఐదేళ్ల నుంచి 16ఏళ్ల వరకూ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, 17-25ఏళ్ల వరకూ ఒకటి, ఆపైన వారంతా మరో విభాగంగా పోటీల్లో పాల్గొనొచ్చు.

అడవిలో ట్రెజర్‌హంట్‌..
కొండపల్లి అటవీ ప్రాంతంలో ట్రెజర్‌ హంట్‌ను నిర్వహిస్తారు. దీనిని కూడా నాలుగు విభాగాలుగా వయసుల ఆధారంగా ఏర్పాటు చేస్తున్నారు.

క్విజ్‌..
అమరావతి ప్రాంతం, కొండపల్లి కోట, ప్రకృతి, అటవీ ప్రాంతానికి సంబంధించిన అంశాలలో చిన్నారులకు క్విజ్‌ పోటీలను నిర్వహిస్తారు.

అందరూ పాల్గొనేలా..
అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ సాహస పోటీల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సాహస క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన సహకారం కోసం దిల్లీలోని యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి తీసుకున్నాం. మహిళలు, చిన్నారులు, యువత, పెద్దలు అందరూ పాల్గొనేలా క్రీడలను రూపొందించాం.

– బి.లక్ష్మీకాంతం, కృష్ణా జిల్లా కలెక్టర్‌

సాహస క్రీడలు ఇవే..
సాహస పోటీలను మహిళలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించనున్నారు. ఏ విభాగానికి చెందినవాళ్లు.. దానిలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా రోజూ కనీసం 500 మంది పోటీలలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. రెండు రోజుల్లో వెయ్యి మంది సాహస క్రీడల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. రెండు రోజుల్లో వెయ్యి మంది వరకూ పాల్గొనగా, తిలకించేవారి సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాప్లింగ్‌: తాడును నడుముకు కట్టుకుని.. కొండ పైభాగం నుంచి కిందకు దిగడం. కాళ్లను కొండపై ఉంచి.. చేతులతో తాడు పట్టుకుని కిందకు దిగే ఈ సాహస క్రీడా పోటీలు రసవత్తరంగా ఉంటాయి.

రాక్‌క్లైంబింగ్‌: తాడును నడుముకు కట్టుకుని.. చేతితో రాళ్లను పట్టుకుంటూ కొండపైకి వెళ్లడం. ఇదికూడా ఆసక్తికరమైన సాహస క్రీడ.

జుమ్మెరింగ్‌: తాడును చేతులతో పట్టుకుని.. ఎగబాకుతూ పైకి వెళతారు. శరీరాన్ని రాతికి ఆనించి.. చేతులతో తాడును పట్టుకుని కొండపైకి వెళతారు.

ట్రెక్కింగ్‌: అటవీ ప్రాంతంలోనికి నడుచుకుంటూ 5-8కిలోమీటర్ల దూరం వెళతారు. పాఠశాలల విద్యార్థులు, మహిళలకు 5కిలోమీటర్లు, మిగతా వారికి 8కిలోమీటర్లు అడవిలోనికి తీసుకెళతారు.

జిప్‌లైన్‌: రెండు కొండల మధ్య తాడును కడతారు. ఆ తాడుకు తాళ్లతో వేళాడుతూ వెళ్లే సాహస క్రీడ ఇది. పాల్గొనే వారితో పాటూ చూసేందుకూ ఒళ్లు గగుర్పొడిచే సాహక క్రీడ ఇది.

కమాండో నెట్‌: ఇది చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది. రెండు భారీ చెట్ల మధ్యలో కట్టిన దృఢమైన వలను పట్టుకుని పైకి వెళ్తూ.. చిన్నారులు వినోదం పొందుతారు. మూడేళ్ల నుంచి 16 ఏళ్ల వరకూ మూడు విభాగాలుగా దీనిలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

ఆర్చరీ: అడవి మధ్యలో పచ్చని చెట్ల కిందన ఆర్చరీ పోటీలను సైతం పిల్లల కోసం నిర్వహిస్తున్నారు.

జోర్బింగ్‌: కొండపై నుంచి బెలూన్‌లో ఉంటూ దొర్లుతూ కిందకు వచ్చే సాహస క్రీడ ఇది.


22122018-VJA-D08.qxd


Butterfly Park.jpg

Butterfly Park EntranceTrecking arrangements Photos 02Trecking arrangements Photos 04

Nectar Plants:

1. alstonia scholaris- rich in nectar-It is a tall elegant tree with greyish rough bark- 12 trees along the borders- nectar plant for more than 10 BF species

2. barleria acuminata violet flowers, perinnial flowering plants

3. barleria cristata-december flowers-violet flowers, perennial flowering plants-3ft height- larval host plants for junonia sps and danaid egg fly

4. barleria cuspidata yellow flowers- perrennial flowering- 1 mt height shrub- host plants for yellow and blue pansy- found in kondapally reserve forest area

5. calliandra haematocephala- red powder puff- shrub- november to april flowering- host plant for common grass yellow-used as host plant

6. capparis sepiaria-Nallavuppi-perennial flowering plants-spreading or climbing, much branched shrub-3to4mt- LHP for common gull yellow orange tip plain orange tip psyche- found in kondapally RF

7. eranthemum capense violet flowers- perrenial flowering-shrubs

8. ixora coccinea- perennial flowering- nectar plant for blue mormon- 1mt height

9. justicia betonica squirrel tail- white and pink flowers- perrinnial flowering plants- very rare- herb upright growth freely branching- host plants for danaid egg fly

10. orthosiphon thymiflorus- Thyme java tea- 1.5 mts tall- pink flowers- perrennial flowering-  herbs but grows as shrubs)- nectar plant for yellow orange tip

11. pentas lanceolata-egyptian star clusters- along the borders -perennial flowering plants- nectar plants common mormon lime swallow tail-host plant for common silverline

12. phyla nodiflora- frog fruit- white to pink flowers- herb- grows as ground cover-substitute for lawn grass- perrinnial flowering plants- larval host plant for peacock pansy

13. Premna-serratifolia head ache tree- evergreen shrub- pale green flowers- April to oct flowering

14. rostellularia crinita-small pink flowers- annual flowering august- 10-25 cms tall- herbs grows as ground cover- nectar plants for common grass yellow common pierrot small cupid small grass yellow-found in kondapally RF

15. Wrightia-tinctoria- small deciduous tree- prennial flowering- 6 trees- nectar plant for blue tiger emigrant sps spot sowrdtail


 

Trecking Track Arrangements 22-Dec-2018

This slideshow requires JavaScript.


Eenadu-amaravati-logo

11 పెద్ద జలపాతాలు 
పేర్లు ప్రకటించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం 

సూర్యారావుపేట(విజయవాడ), న్యూస్‌టుడే: కొండపల్లి అడవుల్లో ఉన్న 11 పెద్ద జలపాతాలకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం శనివారం రాత్రి అధికారకంగా పేర్లను ప్రకటించారు. యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విజయవాడ సభ్యులు 12ఏళ్లపాటు కొండపల్లి అడవుల్లో ట్రెక్కింగ్‌ నిర్వహించి దాదాపు 100కు పైగా చిన్న, పెద్ద జలపాతాలను గుర్తించారు. వీటిని అధ్యయనం చేసి వాటిలో నుంచి 11 పెద్ద జలపాతాలను ఎంపిక చేశారు. ఆయా జలపాతాల ప్రాశస్త్యం, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విజయవాడ ఛైర్మన్‌ ఎన్‌.విష్ణువర్దన్‌ కొన్ని పేర్లను నిర్ణయించారు.  కొండపల్లి అడవుల్లో ఉన్న అందమైన ఈ జలపాతాల వివరాలను తెలుసుకుని కలెక్టర్‌ లక్ష్మీకాంతం సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. కొండపల్లి, దొనబండ, మూలపాడు అడవుల్లో టెక్కింగ్‌ కోసం సిద్ధంగా ఉన్న 21 మార్గాల గురించి కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. సాహస క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. జిల్లా టూరిజం అధికారి డాక్టర్‌ వెలగా జోషి, రత్నప్రసాద్‌, కృపాకర్‌రావు, మల్లికార్జున్‌, అబ్దుల్‌ ఖలిక్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొంగుధార(కొండపల్లి) 
నెమలిధార (మూలపాడు) 
క్షీరలింగ జలపాతం (మూలపాడు) 
మాదులమ్మ తీర్థం (దొనబండ) 
సప్తస్వర ధారలు (దొనబండ) 
చిట్టి తుంబురు కోన (దొనబండ) 
సీతాకోకల గుండం (మూలపాడు) 
కుడి-ఎడమల జలపాతం (మూలపాడు) 
వనమాలి జలపాతం (కొండపల్లి) 
బేబీ చిత్రకూట్‌ (కొండపల్లి) 
జడల కొలను (కొండపల్లి)

WaterFalls Eenadu 06-Aug-2018.jpg

Kondapalli Road.jpg

Baby Chitrakoot WaterFalls - Kondapalli ForestChitti Thumburu Kona - Donabanda ForestJadala Kolanu WaterFalls - Kondapalli ForestKongu Dhaara - Kondapalli ForestKsheera Linga WaterFalls - Mulapadu ForestKudi Edamala WaterFalls - Mulapadu ForestNemali Dhaara WaterFalls - Mulapadu ForestVanamali WaterFalls - Kondapalli Forest

ButterFlies Eenadu 06-Aug-2018.jpg

 

 

Leave a comment