Cyclone-Phethai-Alert-News Clips-December-2018
మంగళవారం, డిసెంబర్ 18, 2018
ప్రధానాంశాలు : సేవలు ప్రశంసనీయం
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: పెథాయ్ తుపాను విషయంలో కలెక్టర్ లక్ష్మీకాంతం నేతృత్వంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ప్రశంసనీయమని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుపాను కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశారన్నారు. విపత్తుల సమయంలో క్షణాల్లో సమాచారం చేరవేసే విధంగా కాస్మిక్ అనే అధునాతన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సునామీని గుర్తించే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. పెథాయ్ విషయంలో జిల్లా యంత్రాంగం అతి సూక్ష్మ స్థాయిలో కూడా తీసుకున్న జాగ్రత్తల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ప్రశంసించారన్నారు. విధుల్లో పాల్గొన్న అందరికి అభినందనలు తెలియచేశారు.
రైతులకు నష్టం వాటిల్లనీయం : వర్షం కారణంగా జిల్లాలో కొన్ని చోట్ల పంట నీటబారిన పడిందని, ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దేవినేని చెప్పారు. చేలల్లో ఉన్న నీటిని తక్షణం తొలగించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాత్రింబవళ్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా నీటిమట్టం 12 అడుగులకు చేరిందని, ఏడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంలో రైతులు కలవర పడాల్సిన అవసరం లేదని, ముందు పొలాల్లో ఉన్న నీటిని బయటకు తరలించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ధాన్యం రంగుమారినా కొనుగోలు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నష్టం అంచనాకు ప్రత్యేక అధికారులు : కలెక్టర్
పెథాయ్ కారణంగా జిల్లాలో వాటిల్లిన నష్టాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. మచిలీపట్నం అర్బన్‌కు నాగరాణి, మచిలీపట్నం గ్రామీణ ప్రాంతానికి స్వప్నిల్దినకర్, నాగాయలంకకు లావణ్యవేణి, కృత్తివెన్నుకు వెంకటేశ్వర్లు, కోడూరుకు మిషాసింగ్‌లు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారన్నారు. వరి పొలాల్లో ఉన్న వర్షపు నీటిని ఇంజిన్ల ద్వారా బయటకు తరలించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
ప్రజలకు అందుబాటులో నిత్యావసరాలుసంచార రైతుబజార్‌ను ప్రారంభించిన కలెక్టర్
భాస్కరపురం (మచిలీపట్నం),న్యూస్‌టుడే: తుపాను పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలకు అవసరమైన నిత్యావసరాలైన బియ్యం, కూరగాయలు, పాలు తదితరాలు రైతుబజారులో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంచార రైతుబజారును కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరుగా తమ ఇంటికే కూరగాయలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నిత్యావసరాల కోసం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ తరహా రైతుబజార్లు జిల్లాలోని బందరు, గుడివాడ, కోడూరు, కృత్తివెన్ను ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. తొలుత పట్టణంలోని రైతుబజారును ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ కూరగాయలు, పండ్లు తదితరాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరకులు ఉన్నప్పటికీ¨ పాలు అందుబాటులో లేకపోవడంతో తక్షణమే పాలు కూడా రైతుబజారులో ఉంచాలని ఆదేశించారు. నిత్యవసరాల కొరత లేకుండా చూడాలని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే సహించేది లేదని నిబంధనలకు అనుగుణంగా అమ్మకాలు జరపాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బందరు అర్డీవో జె.ఉదయ్‌భాస్కర్, మార్కెటింగ్ ఏడీ. రవికుమార్, రైతుబజారు ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
నేడూ పాఠశాలలకు సెలవు
పోర్టురోడ్డు, న్యూస్‌టుడే: పెథాయ్ తుపాను నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో రాజ్యలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రభుత్వ, మున్సిపల్, ప్రయివేటు యాజమాన్యాల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలు విధిగా సెలవు ఇవ్వాలన్నారు. ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకూ.. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు తుపాను నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి యథావిధిగా కేంద్రాలు కొనసాగుతాయన్నారు. సీడీపీవోలు, సూపర్వైజర్లు, కార్యకర్తలు, ప్రజలు గమనించాలని కోరారు.
రైతులకు అండగా ఉంటాం
గూడూరు, న్యూస్‌టుడే: రైతులకు అండగా ఉంటాం… ధాన్యమంతా కొనుగోలు చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చిన ఆయన తిరిగి వెళ్తూ మంత్రి కొల్లురవీంద్ర, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంతో కలిసి మండల పరిధిలోని తుమ్మలపాలెంలో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. కత్తులవానిపాలెం సబ్ఛానల్లో పూడిక తొలగించకపోవడంతో పొలాలు నీట మునిగాయని రైతులు చెప్పడంతో తక్షణం పూడిక తొలగించాలని ఆదేశించారు. దీనిపై డీసీ ఛైర్మన్ స్వామి మాట్లాడుతూ ఇప్పటికే పొక్లెయిన్‌ను తీసుకువచ్చామని, త్వరితగతిన పూడిక తొలగింపు పనులు చేపడతామని చెప్పారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ తుపాను దిశను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ 80 శాతం వరకు పంటను ఒడ్డుకు చేర్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయినా పలు ప్రాంతాల్లో పొలాలు నీట మునిగాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క ఎకరా కూడా పంటను నష్టపోవడానికి వీల్లేదని, అదే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులు పొలాల్లో నీటిని తొలగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తీవ్రంగా ఉంటే మోటారు ఇంజిన్లతో తోడిస్తామని చెప్పారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అన్ని శాఖలు సమర్థంగా పనిచేసి 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహించడం మంచి ఫలితాన్ని ఇచ్చిందని అన్నాఉ. కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్డీవో ఉదయభాస్కర్ మాట్లాడారు. ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, తహసీల్దారు మైనర్‌బాబు, తోట వేణు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గండం గట్టెక్కినట్టే
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: గడచిన మూడు రోజులుగా కలవరపర్చిన పెథాయ్ తుపాను తీరం దాటడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. తుపాను ప్రభావం జిల్లాపై ఊహించిన మేర లేకపోయినప్పటికి ఆది, సోమ వారాల్లో కురిసిన వర్షంతో పల్లపు చేలు నీటమునిగాయి. అధికారికంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రశంసలు అందుకున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు నేలవాలి, నీట మునిగిన దాదాపు 8 వేల హెక్టార్లలో వరి పంటను కాపాడే దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగా తీసుకున్న జాగ్రత్త చర్యలు ఫలించాయి. మూడు రోజుల ముందు నుంచి చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తుపాను హెచ్చరికలు వెలువడే నాటికే దాదాపు 80 శాతం మేర కోతలు ముగియగా, మిగిలిన విస్తీర్ణంలో పంట పక్వానికొచ్చిన రైతులు ఒడ్డున పడే చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు పడిన వర్షంతో పనల మీద ఉన్న పంట నీటమునగగా, మరికొన్ని చోట్ల నేలవాలింది. పెనమలూరు, జగ్గయ్యపేట, అవనిగడ్డ, తదితర నియోజకవర్గాల పరిధిలో ఉద్యానవన పంటలకు వర్షం బెడద తప్పలేదు.
ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లాలో తుపాను ప్రభావితమయ్యే మచిలీపట్నం, కోడూరు, కృత్తివెన్ను, నాగాయలంక, పెడన, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, గూడూరు మండలాల పరిధిలోని 181 గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టే విధంగా అధికారులను నియమించారు. గుర్తించిన సముద్రతీర ప్రాంత గ్రామాలకు మండల స్థాయి అధికారులతో కూడిన క్లస్టర్ డిజాస్టర్ మేనేజమెంట్ బృందాలను ఏర్పాటు చేశారు. తుపాను విధుల్లో పాల్గొనేందుకు 2,440 మంది సిబ్బందిని నియమించారు.
పెనుగాలుల కారణంగా రవాణా, విద్యుత్తు, తాగునీరు, తదితర సమస్యల తల్తెతకుండా అవసరమైన యంత్ర పరికారాలు సిద్ధం చేశారు. అన్ని సబ్స్టేషన్లు, రక్షిత మంచినీటి పథకాల వద్ద డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ప్రజలను తరలించేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. రక్షణ చర్యల విషయంలో ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్న భరోసా కల్పించేలా తీరప్రాంత గ్రామాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కవాతు నిర్వహించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం ద్వారా సోమవారం ఉదయం నుంచి కలెక్టర్ లక్ష్మీకాంతం ఎప్పటి కప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర మచిలీపట్నం, గూడూరు, తదితర మండలాల పరిధిలో నీటబారిన పడిన పొలాలను పరిశీలించారు.
38 పునరావాస కేంద్రాలు: తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, నాగాయలంక, పెడన, పెదపారుపూడి, కంకిపాడు, విజయవాడ అర్బన్ మండలాల పరిధిలోని 81 గ్రామాల్లో కచ్చా గృహాలు, తగు రక్షణ లేని నివాసగృహాల్లో ఉన్న వారిని ముందస్తుగానే పునరావాస శిబిరాలకు తరలించే ఏర్పాటు చేశారు. వీరి కోసం ఆయా మండలాల పరిధిలో 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నాగాయలంక మండల పరిధిలో అత్యధికంగా 11 పునరావాస కేంద్రాలు, మచిలీపట్నంలో 8, కంకిపాడు 7, కృత్తివెన్ను 5, విజయవాడ అర్బన్‌లో 4, మిగిలిన చోట్ల ఒక్కొక్క కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు.
మూడు రోజుల వ్యవధిలో శిబిరాలకు వచ్చిన 4,942 మందికి ఉదయం, మధ్యాహ్నం అల్పాహారం, రెండు పూటలా భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలకు పాలు, అవసరమైన వారికి మందులు తదితరాలను అందుబాటులో ఉంచారు. ఒకట్రెండు చోట్ల భోజన ఏర్పాటు విషయంలో ఆరోపణలు వచ్చిన వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని చక్కదిద్దారు.
అల్లకల్లోలంగా సముద్రం
తుపాను తీరం దాటే సందర్భంలో మంగినపూడి బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. గడచిన రెండు రోజులుగా సముద్రంలో అలలు సాధారణంగానే అనిపించినా పర్యాటకులను అనుతించలేదు. సోమవారం ఉదయం పరిస్థితి సజావుగానే ఉన్నా మధ్యాహ్నం సమయానికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగసిపడ్డాయి. సాధారణ స్థితికి భిన్నంగా సముద్రం దాదాపు 10 నుంచి 15 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చింది.
జిల్లాలో 6.3 సెం.మీ సగటు వర్షపాతం నమోదు
తుఫాను ప్రభావంతో జిల్లాలో ఆది, సోమ వారాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పెనుగాలు ప్రభావం అంతగా లేకపోయినా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత విజృంభించింది. గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో 6.3 సెం.మీ సగటు వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా మండవల్లిలో 11.3 సెం.మీ, పెనమలూరు, గుడివాడ మండలాల పరిధిలో 10 సెం.మీ. పైబడిన వర్షం కురిసింది. పెదపారుపూడిలో 9.5 సెం.మీ, చల్లపల్లిలో 9.1, విజయవాడ అర్బన్, కంకిపాడుల్లో 7, రెడ్డిగూడెం, ఉంగుటూరు, విస్సన్నపేట, నందివాడ, చాట్రాయిల్లో 8 సెం.మీ పైబడి వర్షం కురిసింది. నందిగామ, ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, కోడూరు, మండలాలు మినహా జిల్లాలో మిగిలిన మండలాల్లో నాలుగు సెంమీ పైబడిన వర్షపాతం నమోదయ్యింది.
పెదపట్నం తుపాన్ షెల్టర్ లో నిర్వాసితులకు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించిన కలెక్టర్ లక్ష్మీకాంతం… https://t.co/sKbGH6eFmy
సోమవారం, డిసెంబర్ 17, 2018
అలజడి
వీడని పెథాయ్ కలవరం
అప్రమత్తంగా అధికార యంత్రాంగం
నేడు అన్ని పాఠశాలలకు సెలవు
జిల్లాలో 0.2 సెం.మీ. సగటు వర్షపాతం
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే
బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెథాయ్ తుపాను ప్రభావం జిల్లాను వెంటాడుతూనే ఉంది. రెండు రోజులుగా పరిస్థితి సజావుగానే ఉన్నా తీరం దాటే సమయంలో ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన తీరప్రాంత వాసులను కలవరపరుస్తోంది. తుపాను కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను అన్ని కోణాల్లో ఎదుర్కొనేందుకు వీలుగా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు మండలాల పరిధిలో దాదాపు ఏడు వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ లక్ష్మీకాంతం తుపాను విధుల్లో ఉన్నవారిని అప్రమత్తం చేస్తున్నారు.
రెండు, మూడు రోజులుగా జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెథాయ్ ఎక్కడ తీరం దాటుతుందన్న విషయంలో పూర్తి స్పష్టత లేకపోయినా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతున్నాయి. మంగినపూడి బీచ్‌ను ఉదయం కలెక్టర్ సందర్శించారు. మంగినపూడి, ఉప్పాడ కాలనీలను సందర్శించి పరిస్థితులను బట్టి స్థానికులను పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. తుపానుకు ప్రధానంగా ప్రభావితం అయ్యే మచిలీపట్నం, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాల పరిధిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రానికి కృత్తివెన్ను, కోడూరు, మచిలీపట్నం, నాగాయలంక మండలాల్లో మొత్తం 700 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తీరప్రాంత మండలాలకు అవసరమైన రేషన్‌ను డిపోలలో సిద్ధంగా ఉంచారు. తుపాను తీవ్రత ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు గుర్తించిన నాలుగు మండలాల పరిధిలోని 181 గ్రామాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని భావించిన 15 మత్స్యకార గ్రామాల్లో 50 బోట్లను సిద్ధంగా ఉంచారు. వెయ్యి మంది ఈతగాళ్ల సేవల వినియోగించునేలా చర్యలు తీసుకున్నారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో 20 మంది సభ్యులతో కూడిన రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, కృత్తివెన్ను మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. తుపాను తీరం దాటే సందర్భంలో ఎదురయ్యే వర్షం, గాలుల కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారులు, విద్యుత్తు, తాగునీరు వంటి అంశాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాబోయే 48 గంటల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున అప్పటి వరకూ విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 2,000 మంది సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మత్స్యశాఖ కమిషనర్ రామ్‌నాయక్‌తో కలిసి మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, జిల్లాపై ప్రభావం అంతగా ఉండకపోయినా వర్షప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాల కారణంగా ఎటువంటి పంట నష్టం లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
అనవసర భయాలు వద్దు
తుపాను గురించి అనవసర భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతంలు స్పష్టం చేశారు. క్రమంగా బలహీనపడుతున్న నేపధ్యంలో ఊహించిన ప్రమాదం ఉండకపోవచ్చన్నారు. పంటలకు సంబంధించి జిల్లాలో ఇప్పటికే 80 శాతం మేరకు ఒడ్డుకు చేరిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పంట పాలుపోసుకునే దశలో ఉందని, వర్షం పడినా అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారన్నారు. ఇప్పటి వరకూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జిల్లాలో నమోదు కాలేదని తెలిపారు.
3 వ నంబరు ప్రమాద సూచిక
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్నం హార్బర్ వద్ద మూడో నంబరు ప్రమాద సూచిక, మంగినపూడి బీచ్ వద్ద ఎర్రజెండా ఎగరవేశారు. బీచ్‌లోకి సందర్శకులకు అనుమతించకుండా ఆంక్షలు విధించారు.
0.2 సెం.మీ. వర్షపాతం
ఆదివారం ఉదయం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం వరకూ జిల్లాలో 0.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ముదినేపల్లి, గుడ్లవల్లేరు మండలాల పరిధిలో 0.4 సెం.మీ. వర్షం కురియగా, మచిలీపట్నం, నాగాయలంక, అవనిగడ్డ, చల్లపల్లి, కైకలూరు, తదితర మండలాల్లో 0.2 సెం.మీ. వర్షం పడింది. కోడూరు మండల పరిధిలో 0.1 సెం.మీలు ఉండగా
కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో నామమాత్రపు జల్లులు పడ్డాయి.
కలంకారీ మూత
పెడన, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను కారణంగా ఆదివారం ఉదయం నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలో ప్రముఖ హస్తకళల కేంద్రమైన పెడనలో చేనేత, కలంకారీ పరిశ్రమలు స్తంభించాయి. కలంకారీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉత్పత్తి జరిగే కలంకారీ హస్తకళలు దేశవిదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. తుపాను ప్రభావం లేకుంటే సోమవారం నుంచి పరిశ్రమలో ఉత్పత్తి యథావిధిగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే ఉత్పత్తి మరో మూడురోజుల పాటు నిలిచిపోతుంది. పెడన, గూడూరు మండలాల్లో దాదాపు 2 వేల మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రెండు మండలాల్లో వేలాదిగా ఉన్న చేనేత కుటుంబాలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు రూ.2 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకటించటం వారికి ఊరట కానుంది.
ధైర్యంగా ఎదుర్కొందాం
అప్రమత్తంగా అధికారులు
జిల్లా వ్యాప్తంగా ముందస్తు రక్షణ చర్యలు
పెథాయ్ తుపాను ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దిశ మార్చుకుని ప్రయాణిస్తున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఈనెల 17న విశాఖ-కాకినాడ మధ్యలో తీరందాటే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాపై అంత ప్రభావం చూపకపోయినా గాలులు వీయడంతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టిపెడుతూ మిగిలిన ప్రాంతాల్లో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మత్స్యకారులూ.. అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ లక్ష్మీకాంతం
పోర్టురోడ్డు (మచిలీపట్నం), న్యూస్‌టుడే: పెథాయ్ తుపాను తీరం దాటే వరకు మత్స్యకారులెవరూ వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. ఆదివారం ఆయన మంగినపూడి బీచ్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఉప్పాడ నుంచి వచ్చి బీచ్ వద్ద కాలనీలో ఉంటున్న వారిని కూడా కలెక్టర్ కలిసి తుపాను పరిస్థితి గురించి వారికి వివరించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి మత్స్యకారులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.బందరు ఆర్డీవో ఉదయభాస్కర్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ పీఎస్ఏ ప్రసాద్, మత్స్యశాఖ జేడీ యాకూబ్‌పాషా, తహసీల్దారు కె.శ్రీనివాస్, ఎంపీడీవో జీవీ సూర్యనారయణ, డీఎస్పీ మెహబూబ్పాషా, సీడీపీవో దీప్తి కలెక్టర్ వెంట ఉన్నారు.
పెదపట్నం(పోర్టురోడ్డు): తుపాను గురించి ఎవరూ భయపడవద్దని తాము అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం స్పష్టం చేశారు. పెదపట్నం, గొల్లగూడెం ప్రాంతాల్లో కలెక్టర్ లక్షీకాంతం ఆదివారం రాత్రి పర్యటించారు. తుపాను రక్షిత భవనంలో ఉన్న నిర్వాసితులకు భోజన నాణ్యతను పరిశీలించి ఆయనే స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు. అందుబాటులో ఉంచిన జనరేటర్‌ను పరిశీలించిన ఆయన ఏర్పాట్లన్నింటిపైనా సంతృప్తిని వ్యక్తం చేశారు.
– న్యూస్‌టుడే, గొడుగుపేట
తీరప్రాంత మండలాల్లోని తొమ్మిది గ్రామాలపై తుపాను ప్రభావం ఉంటుందన్న భావించి అధికారులు ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బందరు మండలంలోని పెదపట్నం, తాళ్లపాలెం, కృత్తివెన్ను మండలంలో ఇంతేరు, తాడివెన్ను, చినగొల్లపాలెం, నిడమర్రు, కోడూరు మండల పరిధిలోని రామచంద్రాపురం, హంసలదీవి గ్రామాల్లోకి సముద్రం చొచ్చుకుపోయి వచ్చే అవకాశం ఉంటుంది. ముందుజాగ్రత్తగా అధికారులు ఆయా గ్రామాల ప్రజలను అక్కడనుంచి పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.
ఆ 9 గ్రామాలపై ప్రత్యేకదృష్టి
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
* లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
* ఆహారం, మంచినీరు సరిపడ నిల్వ చేసుకోవాలి.
* ఇల్లు ఖాళీచేసి పునరావాసకేంద్రాలకు వెళ్లేవారు ఇంట్లో విలువైన పత్రాలు, వస్తువులు సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలి.
* కిరోసిన్, ఛార్జింగ్‌లైట్లు సిద్ధం చేసుకోవాలి.
* గాలి వీస్తున్న వైపు ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
* పిల్లలు, దీర్ఘకాలిక రోగులకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలి.
* పునరావాస కేంద్రాల్లో అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలి.
* సురక్షిత భవనాలకు వచ్చిన తరువాత అక్కడ ఉన్న ప్రతినిధికి చెప్పకుండా బయటకు వెళ్ల కూడదు.
* కాలానుగుణంగా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* బలమైన గాలులకు విద్యుత్‌తీగలు తెగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి.
* ఇంటి చుట్టూ మురుగునీరు నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలి.
24 గంటలూ కొనుగోలు కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు 1.52లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. తుపాను దృష్ట్యా రైతులు కేంద్రానికి ఎప్పుడు వచ్చినా (24 గంటలూ) కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులు అవగాహనతో ఈ కేంద్రాలు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌యార్డుల్లోని గోదాములను ధాన్యం నిల్వచేసుకునేందుకు సిద్ధంగా ఉంచారు. మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి ఇలా అన్ని మార్కెట్ కమిటీల్లోని గోదాములను రైతులకోసం సిద్ధంగా ఉంచారు. ధాన్యం నిల్వచేసుకోవడానికి అవకాశం లేని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయించుకోవచ్చు. లేదా ధాన్యాన్ని గోదాముల వద్దకు తీసుకువెళ్లి భద్రపరచుకోవచ్చు.
5వేల టార్పాలిన్లు
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పంట నష్టపోకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముందస్తుగా తీసుకున్న చర్యల కారణంగా చాలామంది రైతులు పంటను కాపాడుకున్నారు. శని, ఆదివారాల్లో కోతలు నిలిపివేసి ఇప్పటికే కోసిన పంటను కట్టలు కట్టి కుప్పలు వేసుకుంటున్నారు. ఆదివారం కూడా బందరు, పెడన, గూడూరు, గుడ్లవల్లేరు, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, మొవ్వ అన్ని మండలాల్లోనూ వర్షపు జల్లుల్లో కూడా తడుస్తూ కుప్పలు వేశారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని టార్పాలిన్లు కప్పి భద్రపరచుకుంటున్నారు. 80శాతానికి పైగా పంట ఒడ్డుకుచేరిందని అధికారులు చెబుతున్నారు.మిగిలిన పంటలను కూడా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5వేల టార్పాలిన్లను పంపిణీ చేశారు. 50 శాతం రాయితీతో రూ.2.500లకు అందిస్తున్నందున రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాలకు వెళ్లి తెచ్చుకోవచ్చు.
విద్యుత్సమస్య తలెత్తకుండా..
పెథాయ్ కారణంగా జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తీరందాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నందున దానికనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు వేల విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచారు. బందరు డివిజన్ పరిధిలోని బందరు, పెడన, గూడూరు, బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల పరిధిలోనే 9.01 మీటర్ల విద్యుత్ స్తంభాలు వెయ్యి, 8మీటర్ల స్తంభాలు రెండువేల చొప్పున సిద్ధం చేసినట్లు డీ…ఈ పార్థసారధి తెలిపారు. దీంతోపాటు ట్రాన్స్ఫార్మర్స్, క్రేన్లు, జేసీబీలు, వెల్డింగ్ యంత్రాలు, విద్యుత్ రంపాలు సిద్ధంగా ఉంచారు. ఉన్న సిబ్బందితో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండువేల మంది అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా గంటలోపు విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అందుబాటులో వైద్యం
తుపాను ప్రభావం జిల్లాలో మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, అవనిగడ్డ, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలపై ఉండొచ్చన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల మేరకు జిల్లావైద్య ఆరోగ్యశాఖ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఈమండలాల పరిధిలో ఉన్న 145 గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తతోపాటు పలువురు సిబ్బందిని నియమించారు. పీహెచ్సీ వైద్యులతోపాటు మరో 50మంది వైద్యులను నియమించి మండలాలకు పంపించారు. అత్యవసరమైతే వినియోగించుకోవడానికి 15మంది వైద్యులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉన్నారు. మండలానికో 108 వాహనాన్ని మండల కేంద్రంలో ఉంచారు.ఈ మూడురోజుల్లో ప్రసవాలు జరిగే గర్భిణులను గుర్తించి వారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 104 వాహనాలు, తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌లతోపాటు అవసరమైతే అద్దెకు కార్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి రమేష్ తెలిపారు.
అందరికీ తాగునీరు
తీర ప్రాంత గ్రామాలతోపాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామీణ నీటిసరఫరాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 39 సామూహిక రక్షిత నీటిపథకాలున్నాయి.ఆయా పథకాల నుంచి విద్యుత్ సరఫరా లేక పోయినా తాగునీరు అందించేందుకు 51 జనరేటర్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు గ్రామాల్లోని పథకాల వద్ద కూడా జనరేటలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 200 జనరేటర్లను గ్రామాలకు తరలించారు. దీంతోపాటు తీర ప్రాంత మండలాల్లో ఇంటింటికీ వెళ్లి తాగునీరు అందించేందుకు 42 ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. క్లోరినేషన్ చేయించేందుకు బ్లీచింగ్, ఆలం తదితరాలను గ్రామాలకు తరలించారు. ట్యాంకర్లను శుభ్రంచేసి 15 రోజుల వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రత్యేక బృందాలు..బోట్లు
తీరప్రాంత మండలాల్లో పరిస్థితి సమీక్షించడంతోపాటు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ, మెరైన్ అధికారులు జాలర్లు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేటకు వెళ్లిన బోట్లన్నీ ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో ఎన్డీఆర్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఒక్కో బృందంలో 30మంది చొప్పున రెండు బృందాలను అక్కడకికి తరలించారు. బందరు, కృత్తివెన్ను మండలాల్లో 20మంది సభ్యులతో రెండు ఎస్డీఆర్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వీరు కాక అగ్నిమాపక సిబ్బందితో కూడా ఆరు బృందాలు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్న 15 గ్రామాల్లో బోట్లు,గజ ఈతగాళ్లను కూడా ప్రభుత్వ నియమించింది.ఇలా జిల్లా ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అన్ని ఏర్పాట్లతో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అధికారయంత్రాంగం సిద్ధంగా ఉంది.
64పునరావాస కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో 64 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఆనీరు చొచ్చుకువచ్చే గ్రామాలను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బందరు మండల పరిధిలోని పెదపట్నం, గిలకలదిండి, తదితర ప్రాంతాలతోపాటు నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను మండలంలోని ఇంతేరు లాంటి సముద్రపు ఒడ్డున ఉన్న గ్రామాల్లోని వారికి నచ్చజెప్పి కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆహార సమస్య తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లో 400కుపైగా రేషన్‌దుకాణాల్లో అన్ని సరకులు ఉంచారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మాక్ డ్రిల్
|
సిద్ధంగా యంత్ర సామగ్రి![]() అవనిగడ్డ, న్యూస్‌టుడే: పెథాయ్ తుపాను వస్తే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడటానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ పరిధిలోని అయిదు మండలాల్లో 102 జనరేటర్లు ఏర్పాటు చేశామని ఎస్ఈ డి.సాయినాథ్ చెప్పారు. ప్రతి పంచాయతీలోని మంచినీటి పథకాల పంపుహౌస్‌ల వద్ద తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్లు ఉపయోగిస్తామన్నారు. తాగునీటి సరఫరాకోసం 16 ట్యాంకర్లు కూడా సిద్ధం చేశామని చెప్పారు. అవనిగడ్డ 2, మోపిదేవ 2, నాగాయలంక 5, చల్లపల్లి 2, కోడూరుకు 5 చొప్పున సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సివస్తే ముందు జాగ్రత్తగా పది ట్రాక్టర్లను అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిద్ధంగా ఉంచారు. జనరేటర్లను ఇప్పటికే పంపు హౌస్‌ల వద్ద ఏర్పాటుచేశారు. |
నేడు పాఠశాలలకు సెలవు
మచిలీపట్నం, న్యూస్‌టుడే: పెథాయ్ తుపాను నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశానుసారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా పాఠశాల తెరిచినట్లు తమ దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వణికిస్తోన్న పెథాయ్
దూసుకొస్తున్న తుపానుపై రైతుల్లో ఆందోళన
జిల్లాలో మొదలైన చిరుజల్లులు
రెండు, మూడు రోజులు వర్షం పడితే కష్టమే
వరి కోతలకు రెట్టింపైన కూలి
ఈనాడు – విజయవాడ
అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పంటను పండిస్తున్న రైతులకు పెథాయ్ తుపానుపై ఆందోళన నెలకొంది. చివరి దశకు వచ్చి.. నోటికి అందే పరిస్థితుల్లో దూసుకొస్తున్న తుపాను భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పట్టిసీమ జలాలతో వరి రైతులు ఒడ్డునపడ్డారు. ఈ పరిస్థితుల్లో అనుకోని విధంగా వచ్చిన ప్రకృతి వైపరీత్యం దెబ్బతీస్తుందని మదన పడుతున్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం వద్ద తుపాను తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు. అయితే.. ప్రస్తుతం మన జిల్లాలోని తీరానికి ముప్పు తప్పినట్లేనని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. ఈ ప్రభావం కారణంగా జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు మొదలయ్యాయి. వీటి తీవ్రత పెరగకపోయినా వచ్చే రెండు, మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంటకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అంతా ముసురు పట్టి ఉంది. ఆదివారం ఉదయం వరకు వరి కోతలు జరిగాయి. జల్లులు మొదలు కావడంతో పలు ప్రాంతాల్లో కోతలు ఆపేశారు. కోతలకు కూలి రేట్లు రెట్టింపు అయ్యాయి. కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎవరికి వారు త్వరగా కోసేందుకు ఉద్యుక్తులు కావడంతో రేటు పెంచేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిరంతరం నడుస్తున్నా ధాన్యం తడిస్తే ధరలు తగ్గించే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. డెల్టాలోనే కాకుండా పశ్చిమ కృష్ణాలోనూ వాణిజ్య పంటలు కోత దశకు వచ్చాయి. ఈ ప్రాంతంలోనూ వర్షాలపై అన్నదాతల్లో టెన్షన్ నెలకొంది.
* జిల్లాలో పెథాయ్ ప్రభావం ప్రధానంగా తీర ప్రాంతంలోని మచిలీపట్నం, పెడన, గూడూరు, కృత్తివెన్ను, చల్లపల్లి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్లో మొత్తం 87,436 హెక్టార్లలో వరి పంట వేశారు. ఇప్పటి వరకు 60,736 హెక్టార్లలో పంట నూర్పిడి అయింది. 14,247 హెక్టార్లలో కోసి పనలపై ఉంది. మిగిలిన పంట చివరి దశకు వచ్చింది. ఈ వర్షాలకు పనలపై ఉన్న పంటకు జల్లుల కారణంగా నష్టం ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం పెరిగితే పొలాల్లో నీరు చేరి గింజలు మొలకెత్తే ప్రమాదం ఉంది. వర్షానికి పంటను రక్షించేందుకు వీలుగా వ్యవసాయశాఖ టర్పాలిన్లను రాయితీపై అందజేస్తోంది. 50 శాతం రాయితీపై రూ.1,250కే అన్నదాతలకు సరఫరా చేస్తున్నారు.
* ఇప్పటికే నూర్పిళ్లు పూర్తి అయితే.. ధాన్యాన్ని అమ్మేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాలను నిరంతరం తెరిచి ఉంచుతున్నారు.జిల్లా వ్యాప్తంగా 265 ధాన్యం కోనుగోలు కేంద్రాలను తెరిచారు. వీటిల్లో 1.57 లక్షల మె.టన్నులు కొన్నారు. తుపాను ముందస్తు హెచ్చరికలతో జిల్లాలో గత నాలుగు రోజులుగా వరి కోతలను ముమ్మరం చేశారు. ఈ కారణంగా కూలీలకు డిమాండ్ అమాంతం పెరిగింది. రేటు రెట్టింపు అయింది. సాధారణ రోజుల్లో ఎకరా పొలంలో కోతలకు రూ.2వేలు ఖర్చు అయ్యేది. ఇది ప్రస్తుతం రూ. 4,500 నుంచి రూ.5వేలు వరకు పలుకుతోంది.
* జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. రాత్రి వరకు.. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అత్యధికంగా 5.75 మి.మీ, నాగాయలంకలో 5 మి.మీ, ముదినేపల్లి, ఉంగుటూరులో 4.25 మి.మీ, పడింది. ప్రస్తుతానికి జల్లులే పడటంతో వరి పంటకు ఇబ్బంది లేదు. కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా బీపీటీ, 1061 రకం వంగడాలను వేశారు. వీటికి తడి తగిలితే మొలకలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని భయపెడుతున్నారు. ధాన్యం తడిస్తే ఇప్పుడున్న మద్దతు ధర కంటే తక్కువగా అడిగే అవకాశం ఉంది. కృష్ణా డెల్టాలో చివరి భూములైన దివిసీమ ప్రాంతంలో కోతలు ఆలస్యమయ్యాయి. 15వేల ఎకరాలలో కోసి పనలను వేశారు. 60వేల ఎకరాల్లో పంట చివరి దశలో ఉంది. 10వేల ఎకరాలలో పంట గాలులకు నేలవాలింది. పనలలో ఉన్న పంట మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
* పశ్చిమ కృష్ణాలోనూ జల్లులు పడుతున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో దాదాపు 30వేల ఎకరాల్లో వరి.. నూర్పిడి, కళ్లాల్లో ఉంది. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మిర్చి కోతలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తేమ తగిలితే నాణ్యత తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. సుమారు 10వేల ఎకరాల్లో పంట ఉంది. చేసేది లేక రైతులు పట్టాలు కప్పుతున్నారు.
పునరావాస కేంద్రాల్లో సదుపాయాలపై మండలి ఆరా
పాలకాయతిప్ప(కోడూరు), న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో హంసలదీవి, పాలకాయతిప్ప గ్రామాల్లో పరిస్థితిని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆదివారం పరిశీలించారు. పాలకాయతిప్ప సముద్రతీరంలోకి వెళ్లి సముద్రం పరిస్థితిని గమనించారు. తుపాను ప్రభావం మన జిల్లాకు తక్కువేనని, వాతావరణ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం మన ప్రాంతానికి ఎలాంటి నష్టభయమూ లేదన్నారు. పాలకాయతిప్ప సముద్రతీరంలో గుడిసెల్లో నివసిస్తున్న యానాది కుటుంబాల వారిని అధికారులు గుర్తించి తుపాను రక్షిత భవనంలోకి తీసుకొచ్చారు. వారిని మండలి పరామర్శించారు. వారిలో ముగ్గురు బడిఈడు పిల్లల్ని గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. 45 మందిని పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి ఆహార, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తహసీల్దార్ కేఏ నారాయణరెడ్డి మండలికి వివరించారు. తుపాను తీరందాటేవరకు మండలంలో అధికారులు అప్రమత్తంగా విధుల్లో ఉండాలని, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు.
భయపడాల్సిన అవసరం లేదు : ఎస్పీ
పాలకాయతిప్ప(కోడూరు), న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావం కృష్ణా జిల్లాపై తక్కువేనని, తీరప్రాంత గ్రామాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పాలకాయతిప్ప గ్రామస్థులకు భరోసానిచ్చారు. తుపాను నేపథ్యంలో తీరప్రాంతాల్లో ఆయన పోలీసు సిబ్బంది విధులను పరిశీలించారు. ఇందులో భాగంగా కోడూరు మండలంలో సముద్రతీర ప్రాంతమైన హంసలదీవి శివారు పాలకాయతిప్పలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. తుపాను పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలా సమాయత్తమైందన్నారు. ఇక్కడి విధులు నిర్వహిస్తున్న మెరైన్ పోలీసులు, కోడూరు పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు, సీఐ మూర్తి, కోడూరు ఎస్ఐ ఎస్.ప్రియకుమార్ ఉన్నారు.
గజ..గజ
జిల్లాలో ముసురు వాతావరణం
పెరిగిన చలి తీవ్రత
తిరువూరు, న్యూస్‌టుడే
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచి జల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. సముద్రతీర ప్రాంత మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురుస్తుండగా.. పశ్చిమ కృష్ణాలో నిరవధికంగా జల్లులు పడుతూనే ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చల్లని గాలులు వీస్తుండటంతో వాతావరణంలో తేమ శాతం పెరిగి చలి తీవ్రత అధికమైంది. ప్రజలు గజగజ వణుకుతూ కాలు బయట పెట్టకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ముసురు పట్టిన వాతావరణం నెలకొనడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేస్తూ..
జిల్లాలో తుపాన్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అధికారులు చెప్పినట్లే తొలి రోజు నామమాత్రంగానే ఉంది. ముందు నుంచి భావిస్తున్నట్లు మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం లేకపోవడంతో అధికారులతో పాటు రైతులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ దిశ మార్చుకుని విరుచుకుపడేందుకు వీలున్నందున తగిన విధంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టర్ లక్ష్మీకాంతం క్షేత్రస్థాయిలో అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని అధికారులు, సిబ్బందిని తీరప్రాంత మండలాలకు పంపించారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులకు తెలియజేస్తున్నారు.
వ్యవసాయ పనులకు ఆటంకం
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. కూలీలు, వరికోత యంత్రాల కొరత నేపథ్యంలో వరి నూర్పిడికి రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సాధ్యమైనంత త్వరగా నూర్పిడి పూర్తి చేసి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునేందుకు యంత్రాల కోసం పరుగులు తీశారు. ఇదే అవకాశంగా యంత్రాల నిర్వాహకులు నూర్పిడి చేయడానికి ధర పెంచారు. నిన్నటి వరకు ఎకరానికి రూ.1700 నుంచి రూ.2 వేల వరకు తీసుకోగా.. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గంటల చొప్పున రూ.2,500 వరకు వసూలు చేశారు. యంత్రాలు అందుబాటులో ఉన్న రైతులు మధ్యాహ్నం వరకు వరి నూర్పిడి పనులు కొనసాగించారు. మరోవైపు ధాన్యం తూకం ప్రక్రియ కూడా నిలిచిపోయింది. నూర్పిడి చేసిన ధాన్యాన్ని కళ్లాల్లోనే రైతులు వ్యాపారులకు విక్రయించడంతో ఎక్కడ జాగా ఉంటే అక్కడే తూకం వేస్తూ కనిపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాల్లో మాత్రం శనివారంతో కొనుగోలు ప్రక్రియ ముగించి, కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని తరలించి ఆదివారం నిలిపివేశారు.
నిలిచిన పత్తితీత, మిర్చికోత పనులు
జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో భాగంగా సాగు చేసిన పత్తి, మిర్చి పంటల తీత, కోత పనులకు అవరోధంగా మారింది. మూడు, నాలుగు తీతలకు సిద్ధంగా ఉన్న విచ్చుకున్న పత్తి తీత వరి కోతల నేపథ్యంలో ఆలస్యమైంది. సహజంగా నాణ్యతతో కూడి ఎక్కువ దిగుబడి వచ్చేందుకు ఈ దశలోనే అవకాశం ఉంది. వరి నూర్పిడి అనంతరం పత్తితీత పనులు పూర్తి చేయాలని రైతులు భావించారు. ఈ లోపు తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో కలవరపాటుకు గురవుతున్నారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తే చేతికంది వచ్చిన పత్తి నేలపాలు కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్ల పత్తి నష్టపోవాల్సి ఉంటుందని వాపోతున్నారు. మరోవైపు ముందుగా సాగు చేసిన మిర్చి కొన్నిచోట్ల కోతకు సిద్ధంగా ఉంది. మొదటి కోత పనులను వారం రోజుల క్రితమే ప్రారంభించాల్సి ఉండగా కూలీల కొరత వల్ల నిలిచింది. గాలులు వీస్తే ఏపుగా పెరిగిన మిర్చి పైరు నేలవాలే వీలుంది.
ఆదివారం, డిసెంబర్ 16, 2018
అధికార యంత్రాంగం సిద్ధం
పెథాయ్ తుపానుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈమేరకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని సన్నద్ధం చేసినట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. విజయవాడ నగరంలోని విడిది కార్యాలయంలో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో తుపాను హెచ్చరిక సైరన్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయిల్ ఇంజిన్లను సిద్ధం చేశామన్నారు. వ్యాధులు ప్రబలకుండా రక్షిత నీటి పథకాలను శుభ్రం పరచి, క్లోరినేషను చేయించినట్లు లక్ష్మీకాంతం పేర్కొన్నారు. విజయవాడ డివిజనులోని మండలాల పరిస్థితిపై ఉపకలెక్టర్ మిషాసింగు అధికారులతో సమీక్షించారు.
విపత్తు సమీప గ్రామాలు : 9
పునరావాస కేంద్రాలు : 57
విద్యుత్తు స్తంభాలు : 300
జనరేటర్లు : 129
క్రేన్లు, ట్యాంకర్లు : 69
కచ్చాఇళ్లలోని కుటుంబాలు : 500
అత్యవసర విధులకు సిబ్బంది : 2000
గజ ఈతగాళ్లు : 100
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది : 80
తీరం.. అప్రమత్తం..
తొమ్మిది గ్రామాల్లో సహాయక చర్యలు
ముందు జాగ్రత్త చర్యల్లో సిబ్బంది
పరిస్థితిని సమీక్షిస్తున్న జేసీ విజయకృష్ణన్
కలెక్టరేట్, న్యూస్‌టుడే
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ సూచనల మేరకు సముద్రంలో అలల తీవ్రత, గాలి ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల నిమిత్తం నియమించిన సిబ్బంది శనివారం ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టారు. తుపానును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ప్రధానంగా ప్రభావితమయ్యే మచిలీపట్నం, కోడూరు, కృత్తివెన్ను మండలాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ మండలాల పరిధిలో మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన క్లస్టర్ డిజాస్టర్ మేనేజమెంట్ బృందాలు తమకు కేటాయించిన గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. కలెక్టరేట్ నుంచి సంయుక్త కలెక్టర్ విజయకృష్ణన్ అన్ని శాఖల పరంగా చేపడుతున్న చర్యలపై నిరంతర సమీక్ష నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా కలవరపరుస్తున్న తీవ్ర వాయుగుండం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూసేందుకు అన్ని శాఖల పరంగా చర్యలు చేపట్టారు. తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలతో పాటు తీరం దాటే సందర్భంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రహదారులు, విద్యుత్తు, తాగునీరు వంటి సమస్యలు తలెత్తనీయకుండా చర్యలు చేపట్టారు. చెట్లు పడిపోయి, ఇతర కారణాల వల్ల రవాణా పరమైన ఆటంకాలు లేకుండా చూసే బాధ్యతలో పోలీస్, అగ్నిమాపక, అటవీ శాఖలు నిమగ్నమయ్యాయి. పవర్ సాలు, జేసీబీ, క్రేన్ తదితర యంత్రపరికరాలు సిద్ధం చేశారు. విద్యుత్తు సరఫరా విషయంలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో జనరేటర్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పనులు నిర్వర్తించేందుకు వీలుగా 2,000 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. తాగునీటి కొరత లేకుండా చూసేందుకు వీలుగా శనివారం నాటికి అన్ని ఓహెచ్ఎస్ఆర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. విద్యుత్తు సరఫరా నిలిస్తే ఇబ్బంది లేకుండా జనరేటర్లు సిద్ధం చేశారు. పంట నష్టం వాటిల్లకుండా చూసేందుకు వీలుగా దాదాపు అయిదు వేల టార్పాలిన్లను గ్రామాల వారీగా సిద్ధం చేశారు.
పునరావాస కేంద్రాలు సిద్ధం
అవసరాన్ని బట్టి తీరప్రాంత గ్రామాల ప్రజలను తరలించేందుకు వీలుగా 57 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 27 తుపాను రక్షిత భవనాలు ఉండగా మిగిలిన 30 కేంద్రాలను ఆయా గ్రామాల సమీపంలో ఉండే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. సరైన రక్షణ లేకుండా కచ్చా ఇళ్లలో నివసిస్తున్నట్టుగా గుర్తించిన దాదాపు 500 కుటుంబాలకు సమీప అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో శనివారం రాత్రి నుంచి వసతి కల్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.
తొమ్మిది గ్రామాల ప్రజల తరలింపు
తుపాను ప్రభావంతో సముద్రపు అలలు మూడు మీటర్లకు మించి ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉండటంతో సముద్ర తీర ప్రాంతంలోని తొమ్మిది గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండటంతో మచిపలీపట్నం మండల పరిధిలోని కానూరు, తాళ్లపాలెం, పెదపట్నం గ్రామాలకు చెందిన వారిని మచిలీపట్నం హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన శిబిరానికి, కృత్తివెన్ను మండల పరిధిలోని తాడివెన్ను, ఇంతేరు, చినగొల్లపాలెం, నిడమర్రు గ్రామాలకు చెందిన వారిని కృత్తివెన్నులోని కల్యాణ మండపానికి, కోడూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం, హంసలదీవి గ్రామాలకు చెందిన వారిని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాల్సిందిగా సూచించారు. అన్ని గ్రామాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తుపాను విధుల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది కేటాయించిన ప్రదేశాల్లో తప్పని సరిగా ఉండాలని, విధుల నిర్వహణ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జేసీ విజయకృష్ణన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా హెచ్చరించారు.
కలెక్టర్ అధికారులతో సమీక్ష
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈమేరకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని సన్నద్ధం చేసినట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. విజయవాడ నగరంలోని విడిది కార్యాలయంలో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో తుపానను హెచ్చరిక సైరన్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయిల్ ఇంజిన్లను సిద్ధం చేశామన్నారు. వ్యాధులు ప్రబలకుండా రక్షిత నీటి పథకాలను శుభ్రం పరచి, క్లోరినేషను చేయించినట్లు లక్ష్మీకాంతం పేర్కొన్నారు.
ఉపకలెక్టర్ సమీక్ష : భారీ వర్షాలు కురియనున్న క్రమంలో విజయవాడ డివిజనులోని మండలాల పరిస్థితిపై ఉపకలెక్టర్ మిషా సింగు అధికారులతో సమీక్షించారు. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం..
తుపాను ప్రభావం తీవ్రమవుతున్న క్రమంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసినట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 2 లక్షల హెక్టార్లలో వరి కోతలు పూర్తయినట్లు తెలిపారు. 50 వరి కోత యంత్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.
విపత్తు సమీప గ్రామాలు : 9
పునరావాస కేంద్రాలు : 57
విద్యుత్తు స్తంభాలు : 300
జనరేటర్లు : 129
క్రేన్లు, ట్యాంకర్లు : 69
కచ్చాఇళ్లలోని కుటుంబాలు : 500
అత్యవసర విధులకు సిబ్బంది : 2000
గజ ఈతగాళ్లు : 100
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది : 80
రైతుల్లో వీడని కలవరం
జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి దాదాపు 80 శాతం మేరకు కోతలు పూర్తయ్యాయి. రెండు, మూడు రోజులుగా వాతావరణశాఖ చేస్తున్న హెచ్చరికలతో పన మీద ఉన్న పంటను కాపాడుకునే క్రమంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువురు వరి కోత యంత్రాల ద్వారా నూర్పిడి పూర్తి చేసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హడావుడి పడటంతో వరికోత యంత్రాలకు, కుప్పలు వేసేందుకు కూలీల కోసం అదనపు ఆర్థిక భారం భరించాల్సి వచ్చింది. కొన్ని గ్రామాల్లో కూలీల కొరతతో రైతులు ఆందోళన చెందారు. తుఫాను తీరం దాటే సమయంలో కురిసే వర్షం, గాలుల కారణంగా నష్టపోవాల్సి వస్తుందేమోననే భయం ఇంకా కోత కోయాల్సి ఉన్న రైతుల్లో వ్యక్తమవుతోంది. అరటి, కొబ్బరి, మామిడి తోటలకు గాలుల వల్ల చెరుపు సంభవిస్తుందేమోననే భయం సాగుదారులను వెంటాడుతోంది.
Pethai Eenadu Krishna 16-12-2018
తుపాను హెచ్చరిక .. ఆకాశవాణి విజయవాడ : 15-12-2018 – 07:45am
తుపానుపై భయపడొద్దు : కలెక్టర్
పెథాయ్ తుపాను ఏర్పాట్లపై సమీక్ష
క్షేత్రస్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు
అవనిగడ్డ, న్యూస్‌టుడే: పెథాయ్ తుపాను వలన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీకాంతం చెప్పారు. ఎదురుమొండిలో పర్యటించి వచ్చిన అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం 15, 16 తేదీల్లో వాయుగుండం ప్రభావంతో 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 17న సాయంత్రానికి ఒంగోలు, కాకినాడ మధ్య తీరాన్ని దాటే ఆస్కారం ఉందని, ఆ సమయంలో 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. చెట్లు పడే ప్రమాదం ఉందని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగొచ్చని చెప్పారు. 4 గ్రామాలను క్లస్టర్‌గా చేసి ఒక అధికారి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. 100 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చమురు యంత్రాలను సిద్ధం చేసి, మండల కేంద్రాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసి బాధ్యులను నియమించామన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు సిద్ధం చేస్తున్నామని, గుడిసెల్లో నివసిస్తున్న వారిని ముందుగా పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా శనివారం రాత్రికి అవసరమైన బియ్యం, ఇతర రేషన్ వచ్చే నెలకు సంబంధించినది కూడా ఇప్పుడే సరఫరా చేస్తున్నామని చెప్పారు. చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలు కూడా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాలు, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నామని, ప్రజలు కూడా వాటిని సమకూర్చుకోవాలని సూచించారు. అవసరమైతే వైద్య సేవలకోసం మచిలీపట్నం, అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రులు, ఆంధ్రా ఆసుపత్రిలో వైద్యులను, మందులను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. అవనిగడ్డలో ఫ్లడ్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది 3 పడవలు, లైఫ్ జాకెట్లతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని ఉపయోగించుకోడానికి సిద్ధం చేశామని చెప్పారు. 5 వేల టార్పాలిన్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి, వాటికి మేత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు అందరూ సురక్షితంగా వెనక్కు వచ్చినట్లు ప్రకటించారు. సమావేశంలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జడ్పీ సీఈవో షేక్ సాలమ్, ఆర్డీవో ఉదయ్బాష్కర్, పాల్గొన్నారు.
ఫెథాయ్‌పై అప్రమత్తం
విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధం
* ఈ తుపాను 16న పెను తుపానుగా రూపాంతరం చెంది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 17వ తేదీ సాయంత్రానికి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఆ తర్వాత గాలుల ప్రభావం తగ్గనుంది.* ఒకవేళ దిశ మార్చుకుంటే దక్షిణ కోస్తా వైపు అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇండియన్ మెటరాలజికల్ శాఖ, ఇస్రో, నాసాలు ఈ తుపానుపై విడుదల చేస్తున్న బులిటెన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు ఒక అంచనా వేస్తున్నారు.ఒకవేళ దిశ మార్చుకుంటే దక్షిణ కోస్తా వైపు అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇండియన్ మెటరాలజికల్ శాఖ, ఇస్రో, నాసాలు ఈ తుపానుపై విడుదల చేస్తున్న బులిటెన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు ఒక అంచనా వేస్తున్నారు.
* ప్రస్తుతం సముద్రంలో రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.ప్రస్తుతం సముద్రంలో రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఈనాడు అమరావతి
పొంచి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణ నష్టం లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తీరం దాటనుంది. దీనికి ఫెథాయ్ తుపానుగా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా దాని ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, సంయుక్త కలెక్టర్ విజయకృష్ణన్ దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫెథాయ్ తుపాను ప్రభావంతో వచ్చే భారీ వర్షాలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. తుపాను ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉండవచ్చని అంచనా వేశారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు పునరావాస శిబిరాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.చి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణ నష్టం లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తీరం దాటనుంది. దీనికి ఫెథాయ్ తుపానుగా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా దాని ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, సంయుక్త కలెక్టర్ విజయకృష్ణన్ దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫెథాయ్ తుపాను ప్రభావంతో వచ్చే భారీ వర్షాలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. తుపాను ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉండవచ్చని అంచనా వేశారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు పునరావాస శిబిరాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
* ప్రస్తుతం శుక్రవారం సాయంత్రానికి మచిలీపట్నానికి ఆగ్నేయంగా బంగాళాఖాతంలో 1100 కిలోమీటర్ల దూరంలో ఈ ఫెథాయ్ తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. ఈ లెక్కన 15 తేదీ సాయంత్రానికి మచిలీపట్నంకు చేరుకోవచ్చని ఒక అంచనా.ప్రస్తుతం శుక్రవారం సాయంత్రానికి మచిలీపట్నానికి ఆగ్నేయంగా బంగాళాఖాతంలో 1100 కిలోమీటర్ల దూరంలో ఈ ఫెథాయ్ తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. ఈ లెక్కన 15 తేదీ సాయంత్రానికి మచిలీపట్నంకు చేరుకోవచ్చని ఒక అంచనా.
* కృష్ణా జిల్లాలో ఖరీఫ్ కోతలు దాదాపు పూర్తి కావొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ధాన్యం ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు వెంటనే ప్రభుత్వ సహాయం తీసుకొని కల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. రహదారులపై పలు ప్రాంతాల్లో ధాన్యం ఆరబోశారు.కృష్ణా జిల్లాలో ఖరీఫ్ కోతలు దాదాపు పూర్తి కావొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ధాన్యం ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు వెంటనే ప్రభుత్వ సహాయం తీసుకొని కల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. రహదారులపై పలు ప్రాంతాల్లో ధాన్యం ఆరబోశారు.
తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి!
కృష్ణా జిల్లాలో తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ వివరించారు. మొత్తం 181 గ్రామాలపై అత్యంత ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. పది మండలాలకు ఈ ప్రభావం ఉంటుంది. ఈ పది మండలాలకు సీనియర్ అధికారులను నియమించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
* 10 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెడన మండలానికి, బందరుకు సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు, కోడూరు మండలానికి డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్, నాగాయలంక మండలానికి డీఆర్డఈఏ ప్రాజెక్టు డైరెక్టర్, మోపిదేవి మండలానికి మెప్మా పీడీ, చల్లపల్లి మండలాన్ని ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డైరెక్టర్, గూడరు మండలాన్ని గృహనిర్మాణ సంస్థ పీడీలను ప్రత్యేక ఆధికారులుగా నియమించారు.10 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెడన మండలానికి, బందరుకు సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు, కోడూరు మండలానికి డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్, నాగాయలంక మండలానికి డీఆర్డఈఏ ప్రాజెక్టు డైరెక్టర్, మోపిదేవి మండలానికి మెప్మా పీడీ, చల్లపల్లి మండలాన్ని ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డైరెక్టర్, గూడరు మండలాన్ని గృహనిర్మాణ సంస్థ పీడీలను ప్రత్యేక ఆధికారులుగా నియమించారు.
* నాలుగు ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు, సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
* 20 స్పీడ్ బోట్లు 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పంచాయతీ స్థాయిలోనూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.20 స్పీడ్ బోట్లు 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పంచాయతీ స్థాయిలోనూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* మూడు అగ్నిమాపక కేంద్రాలను అప్రమత్తం చేసి శకటాలను, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఆస్కోలైట్లు, పోర్టబుల్ జనరేటర్లను సిద్ధం చేశారు.మూడు అగ్నిమాపక కేంద్రాలను అప్రమత్తం చేసి శకటాలను, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఆస్కోలైట్లు, పోర్టబుల్ జనరేటర్లను సిద్ధం చేశారు.
* రెవెన్యూ శాఖతో పాటు వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, నీటి పారుదల, ర.భ. విద్యుత్తు, ఇతర అన్ని శాఖల అధికారులను కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ శాఖతో పాటు వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, నీటి పారుదల, ర.భ. విద్యుత్తు, ఇతర అన్ని శాఖల అధికారులను కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
* ప్రధానంగా 45వేల హెక్టార్లలో వరి నూర్పిడిలు జరగాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను పంపి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీలైనంత వరకు నష్ట నివారణ తగ్గించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన ప్రాంతాల్లో టార్పాలిన్లు వాడాలని, వాటిని యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని సూచించారు. రాత్రి సమయాల్లోనూ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
* తాగునీరు, నిత్యావసర సరకులు ఆయా ప్రాంతాల్లో నిలువ చేయాలని పౌర సరఫరాలను ఆదేశించారు.తాగునీరు, నిత్యావసర సరకులు ఆయా ప్రాంతాల్లో నిలువ చేయాలని పౌర సరఫరాలను ఆదేశించారు.
ముందస్తు చర్యలు చేపడుతున్నాం..!
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రాణ నష్టం లేకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం చెప్పారు. తుపాను ప్రభావంపై ఆయన ఈనాడుతో మాట్లాడారు. ప్రస్తుత అంచనా ప్రకారం 17 వ తేదీ నాటికి తీరం చేరుకునే అవకాశం ఉందని, బందరు సమీపంలో తీరం దాటితే జిల్లాపై అధిక ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దిశ మార్చుకుని వెళితే ప్రభావం తక్కువగా ఉంటుందని, అన్నింటికి సిద్ధమవ్వాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. పరిస్థితిని బట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధం
పెథాయ్ తుపానుపై కలెక్టర్
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో పొంచి ఉన్న పెథాయ్ తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న క్రమంలో, దీన్ని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, గూడూరు, పెడన మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 1349 మెకనైజ్డ్, మోటార్ నైజ్డ్ బోట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. 10 ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యాధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో జనవరి నెలకు పంపిణీ చేయాల్సిన నిత్యావసరాలను సిద్ధం చేసినట్టు తెలిపారు. సముద్ర తీర గ్రామాల్లో 51 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు.
రానున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అగ్నిమాపక దళాల బృందాలు జిల్లాకు రానున్నట్టు కలెక్టర్ తెలిపారు.
ఆందోళన వద్దు
వాయుగుండం ప్రభావంపై సమీక్షలో కలెక్టర్, ఎస్పీ
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంపై అనవరసర భయాందోళలను లోను కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీకాంతం స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో శుక్రవారం ఆయన వివిధ అంశాలపై చర్చించారు. వాతావరణశాఖ సూచనల మేరకు తీవ్ర వాయుగుండం శనివారం ఉదయం తుపానుగా, 16వ తేదీ సాయంత్రానికి పెను తుపానుగా మారి 17వ తేదీ సాయంత్రానికి బలహీనపడి తుపానుగా మారుతుందన్నారు. ఎక్కడ తీరం దాటుతుందన్న విషయంపై శనివారం స్పష్టత వస్తుందని తెలిపారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా జిల్లా యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియచేస్తామని, ఎటువంటి పుకార్లు నమ్మవద్దని సూచించారు. సీనియర్ జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు తెలిపారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తుందని చెప్పారు. తుపాను ప్రభావానికి గురైతే రవాణా వ్యవస్థ, విద్యుత్తు వ్యవస్థలకు ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 250 విద్యుత్తు స్తంభాలను సిద్ధం చేశారని, కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సజావుగా పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. తుపాను కారణంగా తీవ్ర ప్రభావితమయ్యే 180 గ్రామాలను గుర్తించి అక్కడ సేఫ్ రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. అధిక వర్గాల కారణంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని డ్రెయిన్లలో తూటుకాట, తదితరాలు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవనిగడ్డలో ఫ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి సిమెంట్, ఇసుక బస్తాలు, వెదురు బాదులు, తదితరాలు సిద్ధంగా ఉంచామన్నారు. సముద్ర తీరప్రాంత మండలాల్లోని కచ్చా ఇళ్లల్లో నివసించే వారిని రక్షిత ప్రదేశాలకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందిచామన్నారు. జిల్లాలో ప్రస్తుతానికి రెండు లక్షల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయని, పంటను కాపాడునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆసుపత్రుల్లో అవసరమైన మంచాలు, పాముకాటు సహా ఇతరత్రా అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సంయుక్త కలెక్టర్ విజయకృష్ణన్, బందరు ఆర్డీవో ఉదయభాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు.
అప్రమత్తంగా వ్యవహరించండి : ఎస్పీ త్రిపాఠి
తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చుకున్నామని తెలిపారు. తీరప్రాంత గ్రామాల్లో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. తీరప్రాంత గ్రామాల్లో సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి ప్రజల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. సామాజిక సేవలో మమేకయ్యేవారు, వలంటీర్లు, కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్(సీపీవో)ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బంది ముందస్తుగానే అవగాహన కల్పించాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ సజావుగా ఉండేలా చూసేందుకు దాదాపు 100 వీహెచ్ఎఫ్ స్టాటిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలను, 300కు పైగా వైర్లెస్ కమ్యూనికేషన్ ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. రెస్యూ ఆపరేషన్‌లో శిక్షణ పొందిన 7 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఇతర శాఖల పరంగా సేవలను సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో అనుభవాలను పరిగణనలోకి తీసుకొని అందుకు తగ్గ విధంగా రూపొందించిన ప్రణాళికలను సమర్థంగా చేపట్టాలని చెప్పారు. ఏఎస్పీ సోమంచి సాయికృష్ణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు సమావేశంలో పాల్గొన్నారు.
ముందస్తు చర్యల్లో నిమగ్నం కావాలి
తుపాను ముందస్తు చర్యల్లో అన్ని విభాగాలు నిమగ్నం కావాలని సంయుక్త కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశమై తుపాను విషయంలో తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో శనివారం రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. తీరప్రాంత మండలాల్లోని తుపాను రక్షిత భవనాలకు ఇన్ఛార్జులను నియమించాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే అవసరమయ్యే ఆహారం, మంచినీరు, పాలు తదితర నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, వ్యవసాయం, విద్యుత్తు, మత్స్య, తదితర శాఖల వారీగా చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ప్రతి ఐదు గ్రామాలకు ఏర్పాటు చేసిన క్లస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అల భయం
ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం
పంటను రక్షించుకునేందుకు 5 వేల టార్పాలిన్లు
ప్రతి ఐదు గ్రామాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు
కలెక్టరేట్,గొడుగుపేట(మచిలీపట్నం) న్యూస్‌టుడే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. తీవ్ర వాయుగుండం పెను తుపానుగా మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని విభాగాలకు కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాలు జారీ చేశారు. తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావం జిల్లాపై ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ విజయకృష్ణన్‌లు ఇప్పటికే రెండు విడతలుగా అధికారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తుపానును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్ల కోసం శాఖల వారీ అవసరాలను తెలుసుకోవడంతో పాటు వాటిని సమకూర్చునేలా ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు వేటకు ఎవ్వరూ వెళ్లనీయకుండా హెచ్చరికలు జారీ చేశారు.
తీర ప్రాంత మండలాలపై దృష్టి
సముద్రతీర ప్రాంత మండలాలపై దృష్టి సారించారు. సముద్ర తీరానికి 5 నుంచి 10 కి.మీ.ల దూరంలో ఉండే గ్రామాలు, నివసించే జనాభా తదితర వివరాలను సేకరించారు. తుపాను రక్షిత భవనాలను సంసిద్ధం చేయడంతో పాటు మరికొన్ని పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. పెనుగాలుల నేపథ్యంలో రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా, పడిపోయిన చెట్లను తొలగించే విధంగా యంత్ర పరికరాలను మండలాల వారిగా సమకూర్చారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ఇప్పటికే సబ్స్టేషన్ల వారీగా జనరేటర్లు ఏర్పాటు చేశారు. తక్షణం స్తంభాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అవనిగడ్డలో పోల్ డ్రిల్లింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. పొక్లెయిన్లు, క్రేన్లను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావం 19వ తేదీ వరకూ ఉండే అవకాశాలు ఉన్న దృష్ట్యా తాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను శుభ్రపరిచి శనివారం నాటికి పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండేలా చూడాలని గ్రామీణ రక్షిత మంచి నీటి విభాగ అధికారులను ఆదేశించారు. 15 రోజులకు సరిపడా నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నీటి సరఫరా కోసం 70 ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నారు. పునరాసవాస కేంద్రాల్లో ఉండే వారికి అసరమైన ఆహార ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తీరప్రాంత మండలాల్లో నెలకు సరిపడా రేషన్ ఉండేలా నిల్వలు సిద్ధం చేస్తున్నారు. పశువుల రక్షణ కోసం అవసరమైన షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అవసరమైన మేత, నీరు నిల్వ చేసేలా చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ తీరప్రాంత గ్రామాల్లో రోగులు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తగు ప్రచారం కల్పిస్తోంది. .
ప్రత్యేక బృందాలు
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతి ఐదు గ్రామాలకు ఒక క్లస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలకు చెందిన మండల స్ధాయి అధికారులు బృంద సభ్యులుగా ఉంటూ విపత్తు నిర్వహణ పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. అవసరాన్ని బట్టి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా రవాణా సౌకర్యాల ఏర్పాటు చేసే దిశగా ఆర్టీసీని సమాయత్త పరిచారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రధాన దృష్టి సారించేలా పంచాయతీరాజ్ శాఖకు తగు సూచనలు చేశారు. కలెక్టరేట్‌తో పాటు విజయవాడ, అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు వీలుగా కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటయ్యాయి. వరి కోతలు సాగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కోత కోసిన పంటలను రక్షించుకునేందుకు వీలుగా ముందస్తుగా 5 వేల టార్పాలిన్లను సిద్ధం చేశారు. కలెక్టర్ లక్ష్మీకాంతం అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని తీరప్రాంత మండలాల్లో పర్యటించి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ముందస్తు చర్యలను పర్యవేక్షించారు.
పంటను ఒడ్డుకు చేర్చేలా
జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని పొలాలు అన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. బందరు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి ఇలా ఆయా మండలాల పరిధిలో ఎక్కువశాతం పంట కుప్పలు, పనల దశలో ఉండటంతో వ్యవసాయశాఖ అధికారులు వారిని అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి ఠాగూర్‌నాయక్ పామర్రు, నిడుమోలు, తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. 9 తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా ఉన్న ఎంపీఈవోలు అందరికీ విధులు కేటాయించడంతోపాటు సెలవులు రద్దు చేశారు. ఇప్పటికే సెలవులో ఉన్నవారి స్థానంలో వేరేవారిని కేటాయించడంతోపాటు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మండలాల వ్యవసాయశాఖ అధికారులతోపాటు సిబ్బంది గ్రామాల్లో రైతులను అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు పంటకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు నాయక్ తెలిపారు.
47 పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న తీరప్రాంత మండలాల్లో తుపాను తీవ్రతను బట్టి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దీనిలో భాగంగానే బందరులో 14, నాగాయలంకలో 16, కోడూరు మండలంలో 13, బంటుమిల్లి మండలంలో 2, కృత్తివెన్ను మండలంలో 2 కేంద్రాలు చొప్పున ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. తుపాను రక్షిత భవనాలు లేని ప్రాంతాలతోపాటు శిథిలావస్థకు చేరిన గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లోని పాఠశాల, సామాజిక భవనాలు, పాఠశాలలు, కళాశాలల్లో వసతులు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. దీంతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు పోలీసు, రెవెన్యూశాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేసింది.