Vinayaka-Chavithi-13-sep-2018
మట్టి వినాయక ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణ
ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు.. జిల్లా ప్రజలకు కలెక్టర్ లక్ష్మీకాంతం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాలని పేర్కొన్నారు.
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాలుష్యం లేని మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. ఎస్.కె.సి.వి.ట్రస్టు, ఎన్.సి.ఎల్.పి.కి చెందిన విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను, నగరంలోని తమ విడిది కార్యాలయంలో కలెక్టర్ బుధవారం పరిశీలించారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎన్సీఎల్పీ పీడీ డి.ఆంజనేయరెడ్డి, మేనేజర్ బి.లక్ష్మీప్రసన్న, ఎస్కేసీవీ ట్రస్టు ప్రతినిధి రాజకుమారి, కృపా ఫౌండేషన్ ప్రతినిధి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.