Covid19-CoronaVirus

Covid19-CoronaVirus

Covid19-CoronaVirus

జీవనయానంలో సంక్లిష్ట దశలో ఉన్నాం. ప్రస్తుతం వైరస్‌ కారణంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి వైరస్‌ పుట్టుక, పరిణామక్రమం, రక్షణ చర్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్న వైరస్‌ బారినుంచి ఎవరికివారు కాపాడుకోవాలంటే స్వీయ నియంత్రణ, సామాజిక దూరం ప్రధాన నివారణోపాయాలు.
లక్ష్మీకాంతం
చైర్మన్‌, ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అసోసియేషన్‌
హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : వైరస్‌ అనేది జీవక్రియల ప్రకారం నిర్లిప్తంగా ఉంటుంది. ఇది నిర్జీవ పదార్థం. ఇది మానవుని శరీరంలోకి చొచ్చుకొని వెళ్లాక జీవంగా మారుతుంది. వైరస్‌ అనేది లాటిన్‌ పదం. దీనర్థం వీనం(విషం) అని. ఇది స్లైనీ లిక్విడ్‌(జిగట ద్రవ) రూపంలో ఉంటుంది. భూమి ఏర్పడి సుమారు 460 కోట్ల (4.6బిలియన్‌) సంవత్సరాలు దాటింది. సూర్యుడి నుంచి ఒక భాగం విడిపోయి భూమిగా రూపాంతరం చెందాక, ఆ భూమిలో జీవాలు ఏర్పడ్డాయి. వాటిలో మొట్టమొదటిది నీటిలో ఏర్పడింది. ఇటువంటి జీవజాలాలన్ని ఐదు రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అందులో మోనేరా (బ్యాక్టిరీయా), ప్రోటిష్ట, ఫంగయ్‌ (శీలింధ్రాలు), వృక్షాలు, జంతువులుగా విభజించవచ్చు. ఇది ఏజోయిక్‌ మహా యుగంలో ఏర్పడింది. ఏజోయిక్‌, ఆర్కియోజాయిక్‌ మహాయుగం, పెలియోజాయిక్‌ మహాయుగం, మిసోజాయిక్‌ మహాయుగం, ఇప్పుడున్నది సీనోజాయిక్‌ మహాయుగం. అంటే మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉన్న అవతారాల వలనే మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహ అవతారం, కల్కి అవతారం లాంటివే ఈ యుగాలు. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టింది. మహావిష్ణువు అవతారం కూడా నీటిలోనే ఉంటుంది. అదే మత్స్యావతారం. ఇది కోఇన్సిడెన్స్‌. వైరస్‌లో న్యూక్లిక్‌ ఆవ్లుం ఉంటుంది. ఆవ్లూల్లో డీఆక్సీ రైబో న్యూక్లిక్‌ ఆవ్లుం, రెండవది రైబోన్యూక్లిక్‌ ఆవ్లుం. ఈ న్యూక్లిక్‌ ఆవ్లుము చుట్టూ ప్రొటీన్‌ తొడుగు ఏర్పడుతుంది. ఈ తొడుగును క్యాప్సిడ్‌ అంటారు. ఈ రెండు కలిపితేనే వైరస్‌ అంటారు. పాము విషంలో కూడా ప్రొటీన్లు ఉంటాయి. కనుక ఇది విషం. వైరస్‌లు జీవక్రియ ప్రకారం నిర్లిప్తంగా ఉంటాయి. 20 నుంచి 300నానో మీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఒక మిల్లిdమీటరు అనగా పదిలక్షల నానో మీటర్లు. లుయీపాశ్చర్‌ అనే శాస్త్రవేత్త మొదటిసారి బ్యాక్టిరీయాను కనుగొన్నారు. కానీ వీటిని కనుక్కోలేకపోయారు. బ్యాక్టిరీయా కూడా సూక్ష్మజీవే. అప్పుడు కాంపౌండ్‌ సంయుక్త సూక్ష్మదర్శినిని మాత్రమే కనుగొన్నారు. దీనిలో కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే కనిపిస్తాయి. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నది జకారియా జాన్సన్‌ తర్వాత ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ కనుగొన్నది నోల్‌ మరియు రస్కా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు. ఆ తరువాతే ఈ వైరస్‌ల గురించి విజ్ఞానం బయటపడింది. ఈ వైరస్‌ల శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. ఇది మైక్రో బయాలజీలో ఒక విభాగం. వైరస్‌ను కనుగొన్నది ఐవనోస్కి, బెయేజర్‌ ఇంక్‌. వారిని ఫాదర్‌ ఆఫ్‌ వైరాలజీ అని అంటారు.
వైరస్‌ విస్తృతి ఇలా :
వైరస్‌ విస్తృతికి మల్టిప్లికేషన్‌ కారణం. అనగా రెండింతలు రెండింతలు అవుతూ పోతుంది. వైరస్‌ యొక్క యాక్షన్‌ ఆరు దశల్లో పూర్తవుతుంది. మొదటిది అటాచ్‌మెంట్‌.. ఇది ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ కణం దగ్గర అతుక్కుంటుంది. రెండవ దశ పెనిట్రియేషన్‌ ఒక ఎంజైమ్‌ను విడుదల చేసి చొచ్చుకొని పోవడం. మూడవది ఆన్‌కోటింగ్‌ – ఈ దశలో శరీరం లోపలికి పోతుంది. నాల్గవది రెప్లి కేషన్‌ 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16, అంటే రెండు నాలుగు కావడం జరుగుతుంది. ఐదవ దశ – నాలుగు దశల్లో ఏర్పడిన వైరస్‌ అంతా ఒకే చోట మళ్లిd కలుస్తుంది. ఆరవ దశ – ఈ దశలో అంతా ఒకటైన వైరస్‌ కణంగా మారి విషాన్ని విడుదల చేస్తుంది.
ఆర్‌ఎన్‌ఏ వైరస్‌, డీఎన్‌ఏ వైరస్‌ (న్యూక్లిక్‌ ఆవ్లూలను బట్టి) రెండు రకాలు ఉంటుంది. అదే విధంగా దాని ఆకృతిని బట్టి రెండురకాలు. ఒకటి పొడవుగా, రెండు గుండ్రంగా ఉంటాయి. గొలుసుని బట్టి రెండు రకాలు. ఒక గొలుసు ఉండేవి. రెండు గొలుసులు ఉండేవి. కొన్ని వైరస్‌లు మొక్కలను కూడా ఎటాక్‌ చేస్తాయి. మొక్కవైరస్‌లు అంటారు. జంతువులపై ఎటాక్‌ చేసే వాటిని జంతువు వైరస్‌ అంటారు. బ్యాక్టిరీయాలను కూడా ఎటాక్‌ చేస్తాయి. వాటిని బ్యాక్టిరీయా ఫేజ్‌లు లేక బ్యాక్టిరీయా వైరస్‌లు అంటారు.
వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులు :
వైరస్‌లవల్ల కలిగే వ్యాధుల గురించి మనం ఇప్పటికే చాలా నేర్చుకున్నాం. క్యాన్సర్‌, మళూతి, విష జలుబు, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌, గవద బిల్లలు, రుబెల్లా ఇవన్ని ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లవల్ల కలుగుతాయి. డీఎన్‌ఏ వైరస్‌ వల్ల హెర్పస్‌, చికెన్‌ ఫాక్స్‌, కంటికలక, హెపటైటిస్‌ లాంటి వ్యాధులు కలుగుతాయి. 1876లో ఎబోలా వచ్చింది. మనిషి నాలుకకు రోగం వచ్చింది, సహారా దేశాల్లో కొన్ని లక్షల మంది చనిపోయారు. 1967లో మర్బార్గ్‌ వైరస్‌, జర్మనీ, కోతుల ద్వారా వైరస్‌ వ్యాపించింది. దీని వలన కూడా లక్షలమంది చనిపోయారు. ఈ వ్యాధిలో రక్తం గడ్డ కట్టుకుపోవడం ప్రధానంగా కనిపించింది. హంటా వైరస్‌ ఊపిరితిత్తులకు వస్తుంది. ఎలుకల ద్వారా వస్తుంది. ల్లాషా వైరస్‌ గుండె కింది భాగంలో విపరీతంగా వస్తుంది. జ్వరం వస్తుంది. ఎలుకల వల్ల ఇది వ్యాపిస్తుంది. రేబిస్‌ అనేది కుక్కకాటువల్ల వస్తుంది. స్మాల్‌ పాక్స్‌ వైరల్‌(మసూచి) అంటాం. డెంగ్యూ జ్వరం అది కూడా వైరస్‌ వలనే వస్తుంది. ఇన్‌ఫ్లూయేంజా వైరస్‌ అంటే విష జలుబు. ఇలా మనకు వైరస్‌ల కారణంగా వచ్చే రోగాలు అంత సులభంగా పోవు.
కరోనా అంటే :
కరోనా అంటే రింగ్‌, కీరిటం(క్రౌన్‌), పూల దండ. దీని ముఖ్యమైన అంశం సూర్యుడికి గ్రహణం పడుతుంది. అలా పట్టినప్పుడు ఎడ్జ్‌లో ఏర్పడి, వెలుగు మాదిరిగా వస్తుంది. దీనిని కరోనా అంటారు. వూహాన్‌ నగరంలో ఈ వైరస్‌ ఉత్పత్తి అయ్యింది. అలా ఇది రకరకాలుగా ఉత్పత్తి చేస్తుంది. ఇది 53 డిగ్రీల సెంటిగ్రేట్‌ ఉష్ణోగ్రత దాటితేనే చనిపోతుంది. చల్లగా ఉండే ప్రాంతాల్లో బాగా ఉం డిపోతుంది. ఏసీలు, రిఫ్రిజరేటర్‌ల కారణంగా కూడా ఇది వ్యాపిస్తుంది. నివారణకు వేడిగా ఉండేది తినాలి, వేడిగా ఉంటే వాటర్‌ తాగాలి. నిమ్మకాయలు, ద్రాక్షపళ్లు, నారింజపళ్లు, అల్లంముక్కలు, వెల్లుల్లి పాయలు, బ్రోకెలీ ఇవన్ని ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒకే కుటుంబంలో ముగ్గురికి రావొచ్చు. ఇద్దరికి పాజిటివ్‌ అవుతుంది, ఒకరికి నెగిటివ్‌ అవుతుంది. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది.
నోవెల్‌ కోవిడ్‌ :
కోవిడ్‌-19 వూహాన్‌ అనే నగరంలో డిసెంబర్‌లో చైనాలో కనుగొన్నారు. అక్కడి నుంచి కొన్ని వేల మందికి అంటుకుంది. ఇది నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో విదేశాలకు వెళ్లివచ్చిన వారి ద్వారా వ్యాపిస్తుంది. రెండవ దశలో విదేశాలనుంచి వచ్చిన వారి ద్వారా స్థానికులకు వస్తుం ది. మూడవ దశ స్థానికుల ద్వారా గ్రామం, లేదా పట్టణమంతా వ్యాప్తి చెందడం. 4వ దశలో మహమ్మరిగా మారి ప్రళయం సృష్టి స్తోంది. ఇప్పటికి 198 దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉంది. ఇప్పుడు 5,35,000 మంది దీని బారిన పడినారు. 24,000 మందికి పైగా చనిపోయారు. దీనిలో ఎక్కువమందికి సోకింది చైనాలోనే. కాని తక్కువ డెత్స్‌(3200) అయింది చైనాలోనే. వారు స్వీయ నియంత్రణ కారణంగా ఇంట్లోనే ఉండిపోవడం, బయటకు రాకపోవడం, రెండున్నర నెలల పాటు అమలు చేశారు. దీంతో వ్యాధి విస్తృతిని అరికట్టగలిగారు. ఇటలీలో ఎప్పుడైతే సెలవులు ప్రకటించారో అక్కడి ప్రజలు టూర్లు పోవడం, రెస్టారెంట్లకు పోవడం వంటి కారణాలతో ఇది నాల్గవ దశకు చేరిపోయింది. ఇటలీలో 8వేల మందికి పైగా చనిపోయారు. అన్‌కంట్రోల్డ్‌గా తయారైంది. మొదట ఇటలీలో ఎక్కువ మంది చనిపోవడం, తర్వాత చైనా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వంటి 198 దేశాల్లో 5,35,000 మందికి వచ్చేసింది. దీనిలో మనకు మొత్తం ఇండియాలో కూడా 727 మందికి వచ్చింది, ఇప్పటికి 18 మందికి పైగా చనిపోయారు. 80శాతం ఫ్లూ లక్షణాలు ఉండగా, 14 శాతం నిమోనియా లక్షణాలు, 4శాతం క్రిటికల్‌గా మారుతుంది. వివిధ అవయవాలు పనిచేయడం మానేస్తాయి. 2శాతం చనిపోతున్నారు. చనిపోతున్న వారిలో హృదయ, శ్వాసకోస, రక్తపీడన సమస్యలున్న వారు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. కో-మార్బిడిటీ (శరీరంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు) కారణంగా చనిపోతున్నారు. కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా చనిపోయిన వారిలో 13శాతం మందికి హృదయ సంబంధిత వ్యాధులున్నట్లు తెలుస్తుండగా, 9శాతం మందికి డయాబెటీస్‌, 8శాతం మందికి శ్వాస సంబంధిత అనారోగ్యం కారణంగా మృత్యుఒడికి చేరుకుంటున్నారు. 8.5శాతం మందికి రక్తపీడన సమస్య, 7.7శాతం మందికి క్యాన్సర్‌ వంటి వ్యాధులున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ -19తో చనిపోయిన వారిలో 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారు 22శాతం, 70-79 వయస్సున్న వారిలో 8శాతం, 60-69 వయస్సున్న వారిలో 3.6శాతం, 50-59 వయస్సు వారు 1.3శాతం, 40-49 వయస్సున్న వారు 0.4శాతం, 30-39 వయస్సున్న వారు 0.2శాతం, 20-29 వయస్సు వారు 0.2శాతం, 10-19 వయస్సున్న వారు 0.2శాతం, 0-9 వయస్సులో 0శాతం మరణాలు సంభవించాయి. మహిళలతో పోలిస్తే, మగవారే అధికంగా కోవిడ్‌ కారణంగా మృత్యువాత పడుతున్నారు.
లాక్‌ డౌన్‌ :
లాక్‌డౌన్‌ అంటే 1897లో అంటువ్యాధుల సంక్రమణ నియంత్రణ చట్టం. ఆ చట్టం ప్రకారం నిత్యావసరాలు కాకుండా మిగతా షాపులన్నీ మూసివేయడం, రోడ్ల మీద తిరగడం, అన్ని నిషేధించబడినవి. ఎవరైనా దాని ని దాటి బయటకు వస్తే 188 ఐపీసీ 269, 270, 271 సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 65 సంవత్సరాల దాటిన వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల్లోనూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సౌత్‌ కొరియాలో, చైనాలో స్వీయ నియంత్రణ కారణంగా సామాజిక దూరం పాటించి, వ్యాధిని అదుపులోకి తేగలిగారు. ఒక సౌత్‌ కొరియాలో రోజుకు 20వేల మందికి టెస్టులు చేసేవారు. అన్ని టెస్టులు లాబోరేటరీలో చేసేలా ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద స్టే డియాలను హాస్పిటల్స్‌గా మార్చేశారు. భారతదేశం మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ చేశారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎక్కువగా పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నాయి. విదేశాల నుంచి ఎవరైతే వస్తారో వారందరికి హోం క్వారంటైన్‌ తప్పనిసరిగా చేయాలి. కనీసం 14రోజులు సర్వైలెన్స్‌ ఎక్కువ పెట్టాలి. ప్రాఫర్‌గా లేకపోతే కంట్రోల్‌ చేయడం కష్ట ం. దీనిలో మొర్టాలిటీ చనిపోయే వారి శాతం 3నుంచి 4 శాతం ఉంటుంది. ఇది అంటువ్యాధి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్వారంటైన్‌, స్వీయ నియంత్రణ, సామాజిక దూరం ఉండాలి, దీంతో పాటు పరిశుభ్రంగా ఉండాలి. మొత్తం మనం చెక్‌ చేసుకోవాలి, ఆటోమేటిక్‌గా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి రావడం, ఉపిరితిత్తుల్లో నొప్పిరావడం, నీలి రంగుకు మారుతారు. క్వారంటైన్‌ ఎక్కువ వాడాలి.
నియంత్రణ మన చేతుల్లోనే…
కరోనా వంటి విషపు వ్యాధులకు నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. రెండు నెలల పాటు స్వీయ నియంత్రణ(లాక్‌ డౌన్‌)లో ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, చేతులు, శరీరం, తినే ప దార్థాలు, ఆహారపు అలవాట్లు అన్ని క్రమశిక్షణతో మంచి నడవడికతో సాగించాలి. దీనివల్ల మనందరి మొహాల్లో స్మైల్‌ అనే 5 లెటర్‌ అప్పియర్‌ అవుతుంది. స్మైల్‌ అంటే స్వీట్‌ మెమోరీస్‌ విత్‌ లిప్‌ ఎక్స్‌ప్రెషన్‌. ప్రస్తుతం విస్తృతమవుతున్న కరోనా (కోవిడ్‌-19) వ్యాధికి ఎటువంటి వ్యాక్సిన్‌ లేదు. కనీసం సంవత్సరం టైమ్‌ పడుతుంది. ల్యాబ్‌ల్లో సిద్ధమైనా, పరీక్షలు పూర్తయినా, పరిశీలన, పర్యావసానాలు వంటి వాటికి, కనీసం 6 నెలలు పడుతుంది. కనుక మాస్కులు, గ్లౌజులు ఉపయోగించాలి. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌. మాస్క్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ మెడిసిన్‌.
వైరస్‌ వ్యాధుల చరిత్రలోకి…
1720, 1820లో వచ్చిన వ్యాధులు మనకు చాలా నేర్పాయి. మన పూర్వకాలంలో 1720లో ప్లే గు వ్యాధి వచ్చింది. 1820 కలరా వ్యాధి వచ్చింది. 1920లో స్పానిష్‌ ఫ్లూ వచ్చింది. ఈ వైరస్‌ వ్యాధుల్లో కోట్ల మంది చనిపోయారు. 165వ సంవత్సరంలో ప్లే గు వ్యాధి వచ్చింది. అప్పుడు 5 మిలియన్లు చనిపోయారు. మరోసారి వచ్చిన రెస్టోయిన్‌ ప్లేగు వ్యాధి కారణంగా 50లక్షల మంది చనిపోయారు. 541 సంవత్సరంలో మళ్లిd ఓ వైరస్‌ వ్యాపించింది. అప్పుడు రెండున్నర కోట్ల మంది చనిపోయారు. 1346వ సంవత్సరంలో బుబోనిక్‌ ప్లే గు వ్యాధి వచ్చింది. దీనివలన 20 కోట్ల మంది చనిపోయారు. తర్వాత 1852లో కలరా వ్యాధి వచ్చింది. 10లక్షల మంది చనిపోయారు. 1859లో ఫ్లూ వ్యాధి వచ్చింది. ఒక మిలియన్‌ మంది చనిపోయారు. 1910లో కలరా వ్యాధి మళ్లిd వచ్చింది. 8 లక్షల మంది చనిపోయారు. 1918లో ఇన్‌ఫ్లూయెంజా వచ్చింది. దీని వల్ల 5 కోట్ల మంది చనిపోయారు. 1956లో ఏషియన్‌ ఫ్లూ(విష జలుబు) రెండు మిలియన్ల మంది చనిపోయారు. 1968లో మళ్లిd ఫ్లూ వ్యాధి వచ్చింది. ఒక మిలియన్‌ మంది చనిపోయారు.
2002లో సార్స్‌ (సీవియర్‌ అక్యుడ్‌ రెస్పరేటరీ సిండ్రోమ్‌) చైనాలో వచ్చింది. వీటితో పాటు మెర్స్‌(మిడిల్‌ ఈస్ట్‌ రెస్పరేటరీ సిండ్రోమ్‌) 2012లో సౌది అరేబియాలో వచ్చింది. ప్రస్తుతం కోవిడ్‌ -19లో చైనాలో వచ్చింది. రోటా వైరస్‌లు ప్రపంచాన్ని వణికించాయి. 2005-12 మధ్య కాలంలో హెచ్‌ఐవీ వచ్చింది. సుమారు 3.6 కోట్ల మంది చనిపోయారు. చరిత్రలో 165వ సంవత్సరం నుంచి 2020 వరకు ఇంతింత మంది చనిపోతూ వచ్చారు. ప్రస్తుతం 2020 కరోనా వచ్చింది. ఈ వ్యాధితో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. దీనిని బట్టి మన సంస్కృతి, సంప్రదాయాలకున్న విశిష్ట తను అర్థం చేసుకోవాలి. హోమియోపతిలో కూడా చాలా నివారణ మార్గాలు ఉన్నాయి. కరోనా వంటి వ్యాధుల ప్రభావంతో అట్టుడుకిపోతున్న దేశాల గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎక్కువ కిట్స్‌ పెట్టాలి. సర్వైలెన్స్‌ ఉండాలి. ఒక పెషంట్‌కి పాజిటీవ్‌ వచ్చిందంటే ఆ పేషంట్‌ ట్రాకింగ్‌ ఉండాలి. ఆ పేషంట్‌ ఎవరితో మాట్లాడుతున్నాడు. ఏమిటీ అనేది ట్రాకింగ్‌ ఉండాలి. క్వారంటైన్‌ అంటే అంటే క్వాట్రజింటా. అంటే 40 రోజులపాటు స్వీయ నియంత్రణలో హౌజ్‌ అరెస్టు కావడమన్నమాట. ఇలా ఉంటే వ్యాధి విస్తృతి తగ్గిపోతుంది. వైరస్‌ నివారణకు ఎక్కువ కిట్స్‌ పెట్టాలి. పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలి. సౌత్‌కొరియా, చైనా వంటి దేశాల్లో 40 రోజుల స్వీయ నియంత్రణ వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్ట గలిగారు. ఆయా దేశాల్లో ఒక సంవత్సరం రోజులు జైలుశిక్ష, లక్షల డాలర్ల భారీ జరిమానా వంటి వాటితో జనాలు భయపడి స్వీయ నియంత్రణకు ముందుకు వచ్చారు.
హైందవంలోనూ నియంత్రణ..
1720లో కూడా ప్లే గు వ్యాధి వచ్చినప్పుడు శృంగేరీ పీఠాధిపతి సచ్చిదానంద నరసింహ భారతి దుర్గాస్త్రోతం పఠించారు. యతవంతం సమయం సర్వ పద్యోపి రక్షణం కృత్వామి అంటూ దుర్గాస్త్రోత్తాన్ని ఆయన పఠించారు. అప్పుడు కొద్దిగా ప్లే గు వ్యాధి నివారణ అయినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు కూడా ధన్వంతరి స్త్రోతాలను ఎక్కువ మంది పఠించాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ.. ధన్వంతరయే అమృత కలశ హాస్తాయ
సర్వ నివారణాయ త్రైలోకై నాదాయ ఓం మహా విష్ణ వేనమ:
ఇప్పుడు కరోనా అనే విపత్తు వచ్చింది. ఆ విపత్తు వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా కాకుండా సంఘంగా ఏర్పడి సంఘంగా పరిరక్షించుకోవాలి.
సెల్ఫ్‌ కేర్‌ ఈజ్‌ నాట్‌ సెల్ఫిష్‌.. యు కెనాట్‌ సర్వ్‌ ఫ్రమ్‌ ఎన్‌ ఎవ్టీు వెసిల్‌ అని అర్థం చేసుకోవాలి.
క్యాలెండర్‌ సేస్‌ టర్న్‌ మీ..
టైమ్‌ సేస్‌ ప్లాన్‌ మీ..
మనీ సేస్‌ ఎర్న్‌ మీ..
గాడ్‌ సేస్‌ రిమెంబర్‌ మీ..
ఎథిక్‌ సేస్‌ ఫాలో మీ..
వైరస్‌ సేస్‌ డెస్ట్రాయ్‌ మీ..
దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించగలిగితే మంచి నడవడిక మనసొంతమవుతుంది. కాబట్టి సమాజంలోని ప్రతిఒక్కరూ సామాజికదూరం, స్వీయ నియంత్రణ పాటించగలిగితే ఇలాంటి వైరస్‌లు మనల్ని తాకవు. పరోపకారం తప్పనిసరిగా ఉండాలి.. ప్రస్తుతం ఆ సమయం వచ్చింది. వినయం లేని విద్య, శౌర్యంలేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం లేని జీవితం వ్యర్థం, నిరర్ధకం, నిష్ప్రయోజనం కనుక సమాజంలోని మనందరం సంయుక్తంగా ఈ విపత్తును ఎదుర్కొవాలి. అంతేకాని ఏ ఒక్కడితోనో ఈ మార్పు రాదు. దీనికి శాస్త్రం తోడు కావాలి, మన కట్టుబాట్లను క్రమశిక్షణగా అమలు పరచాలి. ఇలా ప్రతిఒక్కరూ ఉంటేనే ఒక రెండు నెలల్లో కరోనాను తరిమివేయగలం.
సేవాగుణమే కీలకం :
సేవ ఎలా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే ప్రకృతి.. ఇతరుల ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని పది మందికి పంచితే అది సంస్కృతి. మనకోసం మనం బ్రతకడం. మన పక్కన వారిని బ్రతికించడం ఇప్పుడు మనముందున్న లక్ష్యం కావాలి. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు.. తుదిశ్వాస తీసుకొని ఏడిపిస్తావు. ఈ రెండు శ్వాసల నడుమల మధ్య బంధమే జీవితం. కాబట్టి పుట్టుక ఒక క్షణం. చావడం ఒక క్షణం. ఈ రెండు క్షణాల మధ్య ఉన్న నరకపూరిత, స్వర్గమయమైన కాలమే జీవితం. ఈ జీవితంలో మనకు తోడుగా వచ్చేది కేవలం మన మంచితనమే. కనుక మన కోసం మనం.. మన సమాజం కోసం మనం అన్నట్లుగా అందరూ భావించాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s