01-October-2019

అక్టోబరు 01, తిరుమల, 2019

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు-2019

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం చిన్నశేష వాహనంపై న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో శ్రీ‌ మలయప్ప

శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై న‌వ‌నీతకృష్ణ అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెమ‌లి పింఛం, పిల్ల‌న‌గ్రోవి, న‌వ‌నీతంతో ఉన్న కృష్ణుడి రూపం భ‌క్తుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s