11-February-2019-News-Clips-TTD-Tirupati-JEO
JEO-Tirumala-Tirupati-Devasthanams-(TTD)-Tirupati
http://tirumala.org
Sri B.Lakshmikantham, IAS
సోమవారం, ఫిబ్రవరి 11, 2019
సామాన్య భక్తులకే ప్రాధాన్యం : తితిదే తిరుపతి జేఈవోగా లక్ష్మీకాంతం బాధ్యతల స్వీకరణ
తిరుమల, న్యూస్‌టుడే: భగవంతుని దర్శనం కల్పించడంలో సంతృప్తికర ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తుల ముఖంలో చిరునవ్వు చూడడమే తమ లక్ష్యమని తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం అన్నారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ తితిదేని ప్రపంచంలోనే ఉన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. భక్తులకు వేగంగా, సులభంగా దర్శనం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అంతకు ముందు మందిరంలోని రంగనాయకుల మండపంలో నూతన జేఈవో దంపతులను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వసతి కల్పన విభాగం డిప్యూటీ ఈవో బాలాజీ, పార్పత్తేదారు శశిధర్ సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం తిరుపతిలోని కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
తితిదే తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు
Sri B.Lakshmikantham, IAS
J.E.O. : Joint Executive Officer, TTD, Tirupati
10-ఫిబ్రవరి-2019
నేడు తిరుపతి జేఈవో బాధ్యతల స్వీకరణ
తితిదేపై పట్టుకలిగిన అధికారిగా లక్ష్మీకాంతం గుర్తింపు
సీఎం నిర్ణయంతో నియామకం
Tirumala Tirupati Devasthanams
TTD Administrative Building
K.T. Road, Tirupati – 517 501
Andhra Pradesh, India
10-ఫిబ్రవరి-2019
లక్ష్మీకాంతానికి స్వాగతం పలుకుతున్న డిప్యూటీ ఈవో బాలాజీ
తిరుమల, న్యూస్‌టుడే: తితిదే తిరుపతి జేఈవోగా బి.లక్ష్మీకాంతం ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి తితిదే జేఈవోగా నియమించారు. ఈయన ఏడేళ్ల కింద తితిదే ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవోగా వసతి కల్పన విభాగంలో పని చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి భక్తులకు సులభంగా గదులు లభించేలా సంస్కరణలు తీసుకువచ్చారు. గదులు ఆధునికీకరణ, భక్తులకు ప్రత్యేక వసతులు కల్పనలాంటి చర్యలు తీసుకున్నారు. దేవస్థానంపై పట్టున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తిరుపతి జేఈవోగా కీలక బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంది. అలిపిరిలో భారీ వసతి సముదాయం నిర్మాణం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం, హైదరాబాదులో నిర్మించిన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ, దేవస్థానం పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావడానికి విశేష కృషి చేయాల్సి ఉంది. దేవస్థానంలో తిరుపతి జేఈవోకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తిగా పేరొందిన లక్ష్మీకాంతం ఆదివారం ఉదయం 8.30 గంటలకు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు సీˆ్వకరించనున్నారు. తిరుమలకు శనివారం రాత్రి చేరుకున్న ఆయనకు తితిదే వసతి కల్పన విభాగం డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.
TTD-Tirupati-JEO
తితిదే తిరుపతి జేఈవోగా లక్ష్మీకాంతం
తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఒకే దగ్గర మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని బదిలీలు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జేఈవో)గా పనిచేస్తున్న పోల భాస్కర్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. 2005 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన 2013లో తితిదే జేఈవోగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 6 సంవత్సరాలకు పైగా తితిదే జేఈవోగా కొనసాగారు. బదిలీల్లో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఐఏఎస్(2006)ను తితిదే తిరుపతి జేఈవోగా నియమించారు.