అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో కృష్ణా జిల్లాను మొదటి స్థానంలో అగ్రగామిగా నిలిపినందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ను ‘దళిత మిత్ర’ పురస్కారానికి ఎంపిక చేసిన శుభసందర్భంలో మంగళవారం నాడు ముదినేపల్లి లోని జిల్లాపరిషథ్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న అమరావతి గ్రీన్ అంబాసిడర్ అంబుల వైష్ణవి కలెక్టర్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.