పోరంకి (పెనమలూరు),న్యూస్‌టుడే: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పధకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడించారు. పోరంకిలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత నాలుగన్నరేళ్లలో 22 శాఖల ద్వారా 82 పథÅ]కాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వాటిలో 74 పథ]కాల పట్ల ప్రజల సంతృప్తి స్థాయి ఏ గ్రేడులో ఉందన్నారు. మిగతా వాటిని మరింత విస్తృతం చేసి ఏ గ్రేడు సాధించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రానున్న మే నెల నాటికి ఎన్ని అభివృద్ధి పథ]కాలను అమలు చేయగలమో గుర్తించి వాటిని కూడా ప్రజలకు చేరువచేయడం జరుగుతుందని వివరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఏపీ ఫైబర్‌నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలను గణనీయంగా తగ్గించగలిగామని వివరించారు. అనంతరం ఆయన గర్భిణుల శీమంతం కార్యక్రమంలో పాల్గొని వారికి కానుకలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొర్రా కనకదుర్గ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి కృష్ణకుమారి, గ్రామ ప్రత్యేకాధికారి ఉమాదేవి,. ఎంపీడీవో విమాదేవి, తహసీల్దారు మురళీకృష్ణ, మాజీ సర్పంచి వేమూరి స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
కానూరు ICDS లో మూడు రోజుల పాటు జరగనున్న పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం నాడు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పౌష్టికాహార లోపం లేకుండా పిల్లలకు, గర్భిణులకు సరైన ఆహారం కల్పించటమే ఈ కార్యక్రమం మొదటి ఉద్దేశమని పేర్కొన్నారు. https://t.co/3M6dSGui0s