దీపావళి సంబరాలు నవంబర్ 2018
👆👆👆
*కన్నుల పండుగగా దీపావళి సంబరాలు*
*పవిత్ర సంగమం లో ఆనంద హేళ్లి*
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి… కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల. రామయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం,జె.సి.బాబురావు నందిగామ తాహసిల్దార్ రామకృష్ణ ఇబ్రహీంపట్నం తాహసిల్దార్ పాల్గొన్నారు. జనరంజకంగా సాగిన ఈ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిచిన అనంతరం పఠాస్సుల విన్యాసాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, తెలుగుదేశం నాయకులు, పాల్గొన్నారు.
*అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు*
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు.. ఇందులో భాగంగా నరకాసుడి దహన కాండను నిర్వహించిన నిర్వాహకులు..
ఆకట్టుకున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు..
నరకాసుని వధను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన స్థానిక ప్రజలు….
బహు పురాతనమైన చరిత్ర కలిగిన ఈ అఖండ భారత దేశంలో కుల మత జాతి వివక్షత లేకుండా జరుపుకునే ఈ దీపావళి పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు….
07-Nov-2018