భారతదేశంలో అతిపెద్ద రంగోలి చిత్రీకరణకు ఇబ్రహీంపట్నం సమీపంలో పవిత్ర సంగమం ప్రాంతం వేదికగా నిలిచింది.
Rangula-Holi-India-Map-30-Oct-2018
India Map in 4,66,000 Sq ft with EC Logo in the Middle | Drawn at Vijayawada
Rangoli to Encourage Young Voters | Krishna Officials Creates World Record
India Book of Records – Gigantic India Map Rangoli Feat News Clips 31-Oct-2018
ఓటు రంగోలి
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం
సమష్టి కృషితో కార్యక్రమం విజయవంతం
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే
భారతదేశంలో అతిపెద్ద రంగోలి చిత్రీకరణకు ఇబ్రహీంపట్నం సమీపంలో పవిత్ర సంగమం ప్రాంతం వేదికగా నిలిచింది. ప్రజలకు ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం మంగళవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకోవడంతో కృష్ణాజిల్లా ఖ్యాతి రెపరెపలాడింది. కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా, తదితర అధికారులు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ సమష్టి కృషితో ఈ రికార్డు సాధించామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికీ ఆయుధమని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన సువర్ణావకాశమని చెప్పారు. అర్హత గల పౌరులందరూ బాధ్యతతో ఓటు కోసం నమోదు చేసుకొని, సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 47లక్షల జనాభా ఉండగా సెప్టెంబరు ఒకటి నాటికి 30.51 లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యాయని, ఈ రెండు నెలల్లో 1,40,000 మంది ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు.
అందరి సమన్వయంతో.. : రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది మూడు రోజుల పాటు సంగమ ప్రాంతంలో కృషి చేయడంతో మంగళవారం నిర్వహించిన రంగవల్లి కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 10.35కు ప్రారంభమై 11.05 నిమిషాలకు పూర్తయింది. కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమందికి జేసీ-2బాబురావు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది తమతో పాటు ఉన్న విద్యార్థులకు సూచనలు ఇస్తూ ఈ రికార్డును సాధించారు. సైకత శిల్పి బాలాజీ ప్రణాళికతో సాగిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం, భవానీపురానికి చెందిన రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించారు.