28-October-2018-NewsClips

28-October-2018-NewsClips

ఈనాడు ఆదివారం, అక్టోబర్ 28, 2018

ఇక 4 రోజులే
నేడు అన్ని బీఎల్‌ఓల వద్ద నమోదు
పరిశీలకులుగా తహసీల్దార్లు
విజయవాడపై ప్రత్యేక దృష్టి
ఈనాడు, విజయవాడ
Enrollment as Voters 4days left Eenadu 28-10-2018
క మిగిలింది కేవలం నాలుగు రోజులు మాత్రమే..! అక్టోబరు 31తో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత కూడా సాధారణ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు నమోదయిన వారు జనవరిలో ప్రచురించే తుది జాబితాలో స్థానం సంపాదించే అవకాశం ఉంది. పలు కారణాల వల్ల కృష్ణా జిల్లాలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. జిల్లా జనాభాలో 67 నుంచి 75శాతం వరకు ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంది. కేవలం 63 శాతం మాత్రమే ఉన్నారు. ఈ భారీ వ్యత్యాసాన్ని పూడ్చేందుకు, కొత్తగా 18, 19 సంవత్సరాలు వయసున్న వారిని ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటరు చైతన్య (స్వీప్‌)కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్టోబరు 31తో గడువు ముగుస్తోంది. ఇక కేవలం ఒకే ఒక్క ఆదివారం మిగిలిఉంది. ఓటు హక్కు అర్హత ఉన్న వారం ఈ ఆదివారం సెలవు దినం కావడంతో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌  బి.లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి బూత్‌లెవల్‌ అధికారి అందుబాటులో ఉంటారని, అక్కడికి వెళ్లి ఓటు హక్కు పొందే దరాఖాస్తు నింపి అందించాలని కోరుతున్నారు. విద్యావంతులు ఆన్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఓటర్లు తక్కువగా ఉన్న విజయవాడ నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ఇంటింటికి తిరిగి నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని ప్రత్యేకంగా ఏజెన్సీకి అప్పగించారు. నగరపౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. మూడు రోజులు.. 70 వేల ఓటర్ల నమోదు లక్ష్యంగా మారింది. ఆదివారం నాడే దీన్ని అధిగమించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.
అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌లు ఉంటాయి. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద బీఎల్‌ఓ అందుబాటులో ఉంటారు. ఆయన వద్ద దరఖాస్తులు తీసుకుని నింపి ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారితో పాటు ఓటర్ల జాబితాలో స్థానం లేనివారు కూడా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ప్రత్యేక నమోదు కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉంది. ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని దీనికి వినియోగించాల్సి ఉంటుంది.
మొత్తం 50 మంది తహసీల్దార్లు, 3968 బీఎల్‌ఓలు వారికి అంతే సంఖ్యలో సహాయకులు, సూపర్‌వైజర్లు అందుబాటులో ఉంటారు. పండగ వాతావరణంలో నమోదు కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు.

అవగాహన ముఖ్యం..!
చాలా మంది 18 సంవత్సరాలు నిండినా నమోదుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రత్యేక అవగాహన స్వీప్‌ కార్యక్రమం పెట్టాం. గతంలో అనంతపురం జిల్లాలోనూ ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లను నమోదు చేసి అవార్డు అందుకున్నాం. అదే స్ఫూర్తితో ఇక్కడ పనిచేస్తున్నాం. జనాభా, ఓటరు నిష్పత్తిని తగ్గించగలిగాం. ఆదివాకం ఓటరుగా నమోదు చేసుకోండి.. వజ్రాయుధంగా వినియోగించండి.            – బి.లక్ష్మీకాంతం, కలెక్టర్‌


28102018-VJA-D01.qxdEnrollment as Voters Jyothy 28-10-2018untitled

ఈనాడు ఆదివారం, అక్టోబర్ 28, 2018

ఓటర్ల గుర్తింపునకు భారీ ప్రచారం: కలెక్టర్‌
విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఓటర్లను గుర్తించి ఓటు హక్కు కల్పించే విధంగా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. శనివారం సిస్టమాటిక్‌ ఓటరు ఎడ్యుకేషన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా పడవలరేవు బీఆర్‌టీఎస్‌ రోడ్డులో సుమారు అయిదు వేల మందితో 3కే రన్‌ను నిర్వహించారు. కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో జనాభా ప్రాతిపదికన 32.50లక్షల మంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందన్నారు. ఇప్పటికే 30.50లక్షల మంది నమోదై ఉన్నారన్నారు. ఫామ్‌-6ఎ, ఇతర పద్ధతుల ద్వారా 1.40లక్షల మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా 60 వేల మంది ఓటు హక్కు పొందాల్సి ఉందని, వీరందరికీ ఈ నెలాఖరు నాటికి ఓటు హక్కు కల్పించే విధంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులతోపాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే నాలుగు రోజుల్లో 60 వేల మంది ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈపీ రేషియో వేయి మందికి కనీసం 670 మంది ఓటరుగా నమోదు కావాలసి ఉందన్నారు. నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాల్సి ఉందన్నారు. యువత ఆన్‌లైన్‌ పద్ధతిలో కూడా ఓటు నమోదు చేసుకునే వీలుందన్నారు. 3కే పరుగు ద్వారా యువతలో చైతన్యం కల్పించి 18ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదుకు దోహదపడతాయన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదుకు చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.బహుమతుల అందజేత
3కే పరుగు పడవల రేవు వద్ద ప్రారంభమై బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదుగా సత్యనారాయణపురం పాత రైల్వే గేటు వద్ద ముగిసింది. జి.రవిచంద్ర ప్రథమ, ప్రశాంత్‌కుమార్‌ ద్వితీయ, శివకుమార్‌ తృతీయ బహుమతులు సాధించారు. వీరందరికీ రూ.2వేల చొప్పున నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలను జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, నగరపోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌లు అందించారు. 3కే పరుగును విజయవంతంగా పూర్తిచేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే ఉస్మాన్‌కు రూ.2వేలు, తోట్లవల్లూరు తహశీల్దారు భద్రుడుకు రూ.2వేలు నగదు బహుమతిని కలెక్టర్‌ అందించారు. డీసీపీ గజరావ్‌ భూపాల్‌కు పోలీసు సంక్షేమ నిధిగా రూ.10వేలు నగదును కలెక్టర్‌ అందించారు. జేసీ-2 పి.బాబూరావు, డీఆర్‌వో జె.ఉదయ్‌భాస్కర్‌, ఆర్‌డీవోలు సీహెచ్‌ రంగయ్య, సత్యవేణిలతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెలగా జోషి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ ఎ.మహేష్‌, పలువురు శిక్షకులు, క్రీడాకారులు, జిల్లాలోని 16 నియోజకవర్గాల తహశీల్దార్లు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


28102018-VJA-D14.qxd28102018-VJA-D10.qxdDeewali Bhoomi 28-10-2018Disaster awareness Bhoomi 28-10-2018Disaster awareness Jyothy 28-10-2018Housing Bhoomi 28-10-2018Monthly Collectors Conference Bhoomi 28-10-2018Paddy Crop Satisfactory Jyothy 28-10-2018Rangavalli


ఈనాడు ఆదివారం, అక్టోబర్ 28, 2018

ఆహ్లాదం… ఆనందం
అందంగా పైవంతెన కింది మార్గం
ఎఫ్‌1హెచ్‌2ఓ బోట్‌ పోటీల నేపథ్యంలో అభివృద్ధి
– భవానీపురం(విజయవాడ), న్యూస్‌టుడే
విజయవాడలోని కనకదుర్గ పైవంతెన కింద ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. వంతెన నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులు చేపడుతుండగా.. దిగువ ఖాళీ ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. నవంబరు 16, 17, 18 తేదీల్లో పున్నమి ఘాట్‌ వేదికగా అంతర్జాతీయ స్థాయి ఎఫ్‌1హెచ్‌2ఓ స్పీడు బోటు పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు 500 మంది రానున్నారు. లక్ష మందికి పైగా ప్రజలు పోటీలు వీక్షించేందుకు వస్తారని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పోటీలు నిర్వహిస్తున్న ప్రదేశానికి సమీపంలోనే పైవంతెన ఉండటం.. ఆ మార్గం నుంచి పున్నమి ఘాట్‌ వద్దకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని అందంగా… ఆకట్టుకునేలా మార్చనున్నారు. ఇప్పటికే అర్బన్‌ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ అధికారులు డిజైన్లను సిద్ధం చేశారు.
విదేశాల్లో మాదిరిగా…పైవంతెన దిగువన ప్రాంతాన్ని విదేశాల్లో మాదిరిగా అభివృద్ధి చేయనున్నారు. అక్కడి ప్రజలు రహదారుల వెంబడి, బహిరంగ ప్రదేశాల్లో ఆటలు ఆడుతారు. వారాంతపు రోజుల్లో గడుపుతుంటారు. పైవంతెన దిగువన కూడా అదేవిధంగా మార్చనున్నారు. ఒక భారీ చదరంగం బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేస్తారు. పిల్లల ఆట పరికరాలు ఉంటాయి. ఓపెన్‌ జిమ్‌, ఫుడ్‌కోర్టు, ఆర్ట్‌ కోర్టు, రాక్‌ గార్డెన్‌ తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్తు దీపాలతో కూడిన ఫౌంటేన్‌లను నిర్మిస్తున్నారు. పైవంతెన స్తంభాలను పచ్చదనంతో నింపుతారు. డివైడర్లలో పచ్చదనం పెంపు చేయనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించారు. మరొక పదిహేను రోజుల వ్యవధిలో అన్నీ పూర్తవుతాయి.
ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాం
– జె.నివాస్‌, కమిషనర్‌, విజయవాడ నగరపాలక సంస్థ
ఎఫ్‌1హెచ్‌2ఓ పోటీలను దృష్టిలో పెట్టుకుని పైవంతెన దిగువన ప్రాంతాన్ని ఆకట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నాం. కొన్ని రోజుల్లోనే ఒక కొత్తరూపు వస్తుంది. జాతీయ రహదారి వెంబడి ఉన్న మార్గం మొత్తం అందంగా ఉంటుంది. సెలవులు, వారాంతపు రోజుల్లో పెద్దలు, పిల్లలు వచ్చి గడిపేలా తీర్చిదిద్దుతున్నాం. ఇది ఒక సందర్శనీయ ప్రదేశంగా మారనుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s