కృష్ణా జిల్లా.. @ 1 : తలసరి ఆదాయంలో అగ్రస్థానం : స్థూల ఉత్పత్తిలోనూ భేష్
25-10-2018 గురువారం కలెక్టర్లల సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు.
కృష్ణా జిల్లా.. @ 1
తలసరి ఆదాయంలో అగ్రస్థానం
స్థూల ఉత్పత్తిలోనూ భేష్
గుంటూరు జిల్లాకు నాలుగో ర్యాంకు
ఈనాడు, అమరావతి
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కృష్ణా జిల్లాలోని 80శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. వివిధ పథకాల అమలు, ఆదాయంలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల సీఎం అభినందించారు. ముఖ్యమంత్రి యువనేస్తం, అన్నక్యాంటీన్ల నిర్వహణ, జ్ఞానభూమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ రుణాల పంపిణీలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. తలసరి ఆదాయంలోనూ, స్థూలఉత్పత్తిలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. గురువారం కలెక్టర్లల సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. పలు అంశాలపై పీపీటీలు ఇచ్చారు. ఘనవ్యర్థాల నిర్వహణ, ట్రైసైకిల్, పశువ్యర్థాల సేకరణ, పాలిథీన్ కలెక్షన్లలో కృష్ణా జిల్లా తొలి మూడు జిల్లాల సరసన నిలిచి అభినందనలు అందుకుంది. కృష్ణా ఆదాయంలో టాప్ లేపింది. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా స్థూల ఉత్పత్తిలోనూ రెండేళ్లుగా అగ్రస్థానంలో నిలిచింది. వివిధ శాఖల ద్వారా ఆర్జించిన పన్ను ఆదాయంలోనూ అగ్రస్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో కృష్ణా జిల్లా ఈఏడాది ఒకటో ర్యాంకు సాధించగా గుంటూరు నాలుగో ర్యాంకు సాధించింది. తలసరి ఆదాయంలో కృష్ణా అగ్రస్థానంలో నిలవగా గుంటూరు అయిదో స్థానంలో నిలిచింది.
2016-17లో ఇలా..!
రేషన్ సరకుల సరఫరాలో కృష్ణా జిల్లా 83.55 శాతం సంతృప్తితో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లా 83.17 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణలో కృష్ణా 84.89శాతంతో మొదటి స్థానం, గుంటూరు 84.33 శాతంతో మూడో స్థానం సాధించాయి. యువనేస్తం సర్వేలో కృష్ణా మొదటి స్థానం గుంటూరు ఆరో స్థానం సాధించాయి.
సమష్టి కృషితో సాధించాం..!
వివిధ విభాగాల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సంతోషం వ్యక్తం చేశారు. అదికార యంత్రాంగం సమిష్టికృషితో సాధించామని అభినందించారు. ప్రజాప్రతినిధుల సహకారం ఉందని గుర్తుచేసుకున్నారు. అంతిమంగా ప్రజల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని, వెనుకబడిన శాఖలపై సమీక్షలు జరిపి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి అభినందనలు అధికారులందరికీ వర్తిస్తాయని చెప్పారు.
టాప్‌లేపిన జిల్లా..!
తలసరి ఆదాయంలో అగ్రస్థానం
స్థూల ఉత్పత్తిలోనూ ప్రథమం
ఈనాడు, అమరావతి
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కృష్ణా జిల్లాలోని 80శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. వివిధ పథకాల అమలు, ఆదాయంలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల సీఎం అభినందించారు. ముఖ్యమంత్రి యువనేస్తం, అన్నక్యాంటీన్ల నిర్వహణ, జ్ఞానభూమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ రుణాల పంపిణీలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. తలసరి ఆదాయంలోనూ, స్థూలఉత్పత్తిలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. గురువారం కలెక్టర్ల సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. పలు అంశాలపై పీపీటీలు ఇచ్చారు. ఘనవ్యర్థాల నిర్వహణ పశువ్యర్థాల సేకరణ, పాలిథీన్ కలెక్షన్లలో కృష్ణా జిల్లా తొలి మూడు జిల్లాల సరసన నిలిచి అభినందనలు అందుకుంది.
కృష్ణా ఆదాయంలో టాప్ లేపింది. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా స్థూల ఉత్పత్తిలోనూ రెండేళ్లుగా అగ్రస్థానంలో నిలిచింది. వివిధ శాఖల ద్వారా ఆర్జించిన పన్ను ఆదాయంలోనూ అగ్రస్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో కృష్ణా జిల్లా ఈఏడాది ఒకటో ర్యాంకు సాధించగా గుంటూరు నాలుగో ర్యాంకు సాధించింది. తలసరి ఆదాయంలో కృష్ణా అగ్రస్థానంలో నిలవగా గుంటూరు అయిదో స్థానంలో నిలిచింది.
* రేషన్ సరకుల సరఫరాలో కృష్ణా జిల్లా 83.55 శాతం సంతృప్తితో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లా 83.17 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
* అన్నా క్యాంటీన్ల నిర్వహణలో కృష్ణా 84.89శాతంతో మొదటి స్థానం, గుంటూరు 84.33 శాతంతో మూడో స్థానం సాధించాయి. యువనేస్తం సర్వేలో కృష్ణా మొదటి స్థానం గుంటూరు ఆరో స్థానం సాధించాయి.
సమష్ఠి కృషితో సాధించాం..!
వివిధ విభాగాల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సంతోషం వ్యక్తం చేశారు. అదికార యంత్రాంగం సమష్ఠికృషితో సాధించామని అభినందించారు. ప్రజాప్రతినిధుల సహకారం ఉందని గుర్తుచేసుకున్నారు. అంతిమంగా ప్రజల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని, వెనుకబడిన శాఖలపై సమీక్షలు జరిపి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి అభినందనలు అధికారులందరికీ వర్తిస్తాయని చెప్పారు.
‘కృష్ణా’ ఆదాయం అధరహో…!
October 26, 2018 10:33 AM
కృష్ణా జిల్లా మరోసారి తన సత్తాను చాటింది. ఆదాయాన్ని సంపాదించడంలో మరోసారి మొదటి ర్యాంక్‌ను దక్కించుకుంది. మొత్తం రాష్ట్ర ఆదాయంలో 3వ వంతు ఆదాయం కృష్ణా జిల్లా నుంచే వస్తోంది. గత ఏడాది కూడా కృష్ణా జిల్లా ఆదాయ సమపార్జనలో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడూ అదే ఒరవడిని కొనసాగిస్తూ…ఈ ఏడాది రూ.8922.93కోట్ల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాకు విశాఖపట్నం నుంచి గట్టి పోటీ ఎదురైంది. విశాఖ రూ.7939.35కోట్లతో రెండో స్థానంలో నిలవగా..తూర్పుగోదావరి 1992.26 కోట్ల ఆదాయంతో మూడవ స్థానంలో నిలిచింది. రూ.1644.84 కోట్లతో గుంటూరు 4వ స్థానంలో ఉండగా… రూ.1048.89 కోట్లతో చిత్తూరు జిల్లా ఐదవ స్థానంలో ఉంది. రూ.962.68 కోట్లతో నెల్లూరు ఆరవ స్థానంలోనూ, రూ.862.31కోట్లతో అనంతపురం ఏడవ స్థానంలో,రూ.816.13కోట్లతో పశ్చిమగోదావరి 8వ స్థానంలో ఉన్నాయి. రూ.751.25కోట్లతో ఆదాయంతో కర్నూలు 9వ స్థానంలో ఉండగా…701.88కోట్లతో కడప జిల్లా 10వ స్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా రూ.661.56 కోట్లతో 11వ స్థానంలోనూ..రూ.417.45కోట్లతో శ్రీకాకుళం 12వస్థానంలో ఉండగా…రూ.351.8 కోట్లతో ‘విజయనగరం’ ఆఖరి స్థానంలో ఉన్నాయి.
సింహభాగం కమర్షియల్ టాక్స్ నుంచే…!
కృష్ణా జిల్లా ఆదాయంలో అత్యధిక భాగం కమర్షియల్ ట్యాక్స్ నుంచే వచ్చింది. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రూ.7971.75కోట్లు ఆదాయం రాగా, ఎక్సైజ్‌శాఖ నుంచి రూ.310.49 కోట్లు, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్‌లు శాఖ నుంచి రూ.323.61కోట్లు, ట్రాన్స్‌ఫోర్టు డిపార్ట్మెంట్ నుంచి రూ.232.65 కోట్లు, మైన్స్ & జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి రూ.70కోట్లు, ల్యాండ్ రెవిన్యూ నుంచి రూ.11.77కోట్లు, అటవీశాఖ నుంచి 2.66 కోట్లు ఆదాయం వస్తోంది.