*“మెగా జాబ్ మేళా”*- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ కృష్ణాజిల్లా వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ది. 30.09.2018న ఉదయం 9.00 గం. నుండి ఆంధ్రలయోలా కళాశాల, విజయవాడ నందు జరుగును. ఈ జాబ్ మేళా నందు 4 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కంపెనీలలో నెలకు రూ.10,000/- నుండి రూ.40,000/- వేల రూపాయల వరకు వేతనం కల్పించబడును.
కావున, పెద్ద ఎత్తున అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు http://jobskills.apssdc.in/sdc వెబ్సైట్ నందు నమోదు చేసుకొని లేదా విద్యార్హత ధ్రువ పత్రములతో నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరడమైనది.
*సం/-. బి.లక్ష్మికాంతం,*
జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్
*కృష్ణాజిల్లా.*