Published on Aug 3, 2018
Andhra Pradesh CM N Chandrababu Naidu attends Grama Darshini & Public Meeting Programme at Tatakuntla Village, Vissannapet Mandal, Krishna district
కృష్ణా కలెక్టర్ లక్ష్మీకాంతంకు ముఖ్యమంత్రి ప్రశంసల వెల్లువ
అభివృద్ధే ధ్యేయంగా జిల్లాను అభివృద్ధి పదంలో నిలిపే క్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం చేస్తున్న సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కొనియాడారు శుక్రవారం కృష్ణాజిల్లా విసన్నపేట మండలం తాత కుంట్ల గ్రామంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు ఈ క్రమంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ బి లక్ష్మీకాంతం అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో కృష్ణాజిల్లా అభివృద్ధి పదంలో ముందు ఉంచినందుకు లక్ష్మీకాంతం ముఖ్యమంత్రి సభావేదికపై అభినందించారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు కృష్ణాజిల్లాలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు పుట్టిన గడ్డగా పేరుందని అటువంటి జిల్లాలో కలెక్టర్ లక్ష్మీకాంతం లాంటి సేవకుడు పనిచేయటం ఎంతో గర్వకారణమని అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పని చేర్పిస్తూ కృష్ణాజిల్లాలో అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపటం జిల్లా ప్రజల అదృష్టమని చంద్రబాబు కలెక్టర్‌ను కొనియాడారు దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ తన కర్తవ్యం లో భాగంగానే సేవలు అందించడం జరుగుతుందని తాము చేస్తున్న సేవలకు ప్రభుత్వం అనుక్షణం అండగా నిలుస్తుందని సహకరిస్తున్న అధికారులకు ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడి దేశంలోనే కృష్ణాజిల్లా అగ్రగామిగా నిలపాలని తన లక్ష్యానికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని కోరారు
కలెక్టర్ లక్ష్మీకాంతం ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా విస్సన్నపేట తాత కుంట్ల గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎంతోమంది గొప్ప వ్యక్తులు పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా. ఇది మన రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది కృష్ణాజిల్లా. ఈ విషయంలో నేను కలెక్టర్ లక్ష్మీకాంతం ను అభినందిస్తున్నా. అధికారుల అందరితో ఆయన ఎంతో వేగంగా పనులు చేపించి కృష్ణాజిల్లా ను మొదటిస్థానంలో ఉండేలా చేశారు. ఇలాంటి కలెక్టర్ ఉండటం జిల్లా అదృష్టం
రాష్టంలోనే ప్రయోగాత్మకంగా E-Ambulance-App ప్రారంభం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామదర్శిని-గ్రామవికాసం-కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సమక్షంలో యాప్ ను ప్రారంభించారు.
కృష్ణాజిల్లాలో ప్రయోగాత్మకంగా E- Ambulence-App ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడంతో ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గరయ్యాయి..
యాప్- ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే తీవ్రంగా గాయపడిన వ్యక్తికి తన ప్రాణాలను కాపాడటానికి మొదటి గంటే వైద్యానికి చాలా ముఖ్యమని అన్నారు..
వారిని అంబులెన్స్ లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించిన వెంటనే ఈ-అంబులెన్స్-యాప్ ఓపెన్ చేసి గాయాలపాలైన వ్యక్తిని కండిషన్‌ను అప్లోడ్ చేసి అతని తీవ్రతని బట్టి ఆయా వైద్యశాలకి సమాచారం చేరుతుందని వెంటనే అక్కడ వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లను డాక్టర్లు సిద్ధం చేసి వెంటనే గాయాలపాలైన వారికి చికిత్సను అందించడం జరుగుతుందని తెలిపారు..
ఈ యాప్ వలన ప్రమాదాల లో తీవ్రంగా గాయాలైన వారి ప్రాణాలను సాధ్యమైనంత వరకు కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం…