Jakkampudi-Economic-City-Township-ETV-30-July-2018
ఆంధ్ర ప్రదేశ్ July 31, 2018
కలెక్టర్ లక్ష్మీకాంతం కృషితో..జెట్సిటీకి తొలగిన అడ్డంకులు..!
దేశంలోనే తొలిసారి నిర్మిస్తోన్న ‘జక్కంపూడి ఆర్థిక నగరం’ (జెట్సిటీకి) అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ముందుగా ప్రధానమైన భూసేకరణ ఒక కొలిక్కి రావడంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చేసిన కృషి అమోఘం. ఆయన కృషితో… జెట్సిటీకి అవసరమైన భూమిని సంపాదించడంతో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో ఇప్పటి వరకు…ప్రభుత్వానికి..రైతులకు మధ్య వివాదం ఏర్పడింది. నగర సరిహద్దుల్లో కల తమ భూమికి కోటి రూపాయలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు భీష్మించడంతో..జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చొరవ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒప్పించి..రైతులు కోరిన విధంగానే…సొమ్ములు చెల్లించడానికి అంగీకరింప చేశారు. ఇప్పటికే..86 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడం దానితో పాటు ఇప్పుడు రైతుల వద్ద నుంచి తీసుకుంటున్న 106 ఎకరాలతో ఇక్కడ 26వేల ఇళ్లను నిర్మించ బోతున్నారు. భూముల సేకరణలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చొరవ తీసుకుని రైతులతో పలుసార్లు మాట్లాడి..వారిని ఒప్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కన్న ఆర్థికనగర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయేలా చేయడంలో విజయం సాధించారు.
దేశంలోనే తొలిసారి నిర్మిస్తోన్న ఈ ఆర్థికనగరంలో ‘పరిశ్రమలు, నివాసాలు, ఆసుపత్రులు,విద్య, వినోదకేంద్రాలు అన్నీ ఒకే చోట నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్థికనగరాన్ని నిర్మించాలని యోచించింది. దీని కోసం అవసరమైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో..రైతుల నుంచి భూమిని సేకరించాల్సి వస్తోంది. పరిశ్రమల స్థాపనతో పాటు..అక్కడ పనిచేసే వారు అక్కడే ఉండే విధంగా…ఇళ్ల నిర్మాణాలను..వారికి కావాల్సిన ఇతర సౌకర్యాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీని కోసం ప్రతిష్టాత్మకంగా..’జక్కంపూడి’ వద్ద దాదాపు 800ఎకరాల్లో మొదటి ఆర్థిక నగరాన్ని నిర్మించాలని..ప్రభుత్వం యోచించి.. నిర్మాణాలను మొదలు పెట్టింది. ఈ భూములను సేకరించడంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం మొదటి నుంచి ఒక వ్యూహం ప్రకారం పనిచేసుకుంటూ వచ్చారు. ఆయన ఇతర అధికారులతో కలసి చేసిన కృషి కారణంగానే…టిడిపి ప్రభుత్వం మొదలు పెట్టిన ఆర్థికసిటీ త్వరలో నిర్మాణ రూపంలోకి రానుంది. ఈ నగరం నిర్మాణం జరిగితే…కృష్ణా జిల్లా రూపు రేఖలు మారిపోతాయనడంలో సందేహం లేదు. జిల్లాలో ఎంతో మంది కలెక్టర్లు పనిచేసినా…’లక్ష్మీకాంతం’ హయాంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని.. జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఆయన హయాంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు జిల్లాకు వస్తున్నాయని, ఆయన కలెక్టర్గా ఇక్కడ పనిచేయడం తమకెంతో సంతోషాన్ని కల్గిస్తుందని జిల్లా ప్రజలతో పాటు,స్థానిక నాయకులు కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు.