13-July-2018-News Clips
http://www.janamonline.com/article?nid=4651
వివిధ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోన్న కృష్ణా జిల్లాను ఇతర జిల్లా అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అంగన్వాడీల అవహగాన, ఆత్మయ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా,శిశు సంరక్షణలో కృష్ణా జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉందని, పౌష్టికాహారం,రక్తహీనరత రహిత జిల్లాగా కృష్ణా జిల్లా రూపొందిందని..ఈ కృషిలో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పాత్ర ఆమోఘమని..ఆయన ప్రశంసించారు. నాలుగు నెలల కాలంలో గర్బిణీలు, స్త్రీల్లో రక్తహీనతను అరికట్టడానికి వారికి సజ్జ,నువ్వుల లడ్డూలను అందించి..వారిలో రక్తహీనతను నిరోధించామని కలెక్టర్ లక్ష్మీకాంతం ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లా సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ..ఇతర జిల్లాలు కృష్ణా జిల్లాను చూసి నేర్చుకోవాలని కోరారు.