6th-Janmabhoomi-January-2019
జన్మ భూమి – మాఊరు : ఆరో విడత కార్యక్రమం
02 జనవరి నుంచి 11 జనవరి వరకు
06 జనవరి 2019
జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం..
ఈటీవి ఆంధ్రప్రదేశ్
మైలవరం మండలం గన్నవరంలో జరిగిన జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, మొదటి రోజు జన్మభూమి నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన రోజుల్లో కూడా విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. https://t.co/roaqDqaUOS
మొదటి రోజు : బుధవారం : 02-జనవరి-2019
కప్పలదొడ్డి గ్రామం – గూడూరు మండలం
[gallery ids=”5078,5081,5079,5080″ type=”slideshow”
జన్మభూమి సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఈనెల రెండో తేదీ బుధవారం నుంచి ఆరంభం కానున్న జన్మభూమి-మా ఊరు గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామసభల్లో ప్రతి రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామ సభలను నిర్వహించే వేదికను పచ్చటి తోరణాలతో, ముగ్గులతో అలకరించాలన్నారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి పనులను వివరించాలన్నారు. జన్మభూమి తరుణంలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించాలన్నారు. వీటిలో పక్కా గృహం, మరుగుదొడ్డి, ఇంకుడు గుంట, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు వంటివి ఉండాలని సూచించారు. ప్రాధాన్య పథకాలపై ఫెక్ల్సీలను ఏర్పాటు చేయాలన్నారు. ఫుడ్ ఫెస్టివల్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని, 11వ తేదీన రంగోలీ, వ్యాసరచన, ఆటల పోటీలను నిర్వహించాలన్నారు. జిల్లాలోని 970 పంచాయతీలు, 277 మున్సిపల్ వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు.
అజెండా ప్రకారం నిర్వహణ
ఎజెండా ప్రకారం జన్మభూమి-మా ఊరు గ్రామ సభలను నిర్వహించాలని కలెక్టరు సూచించారు. తొలుత ప్రార్ధనతో ప్రారంభించి, ఆ తర్వాత ఎజెండా రూపురేఖ, అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి ప్రతిజ్ఞ చేయాలన్నారు. లబ్దిదారుల వివరాలను, వారికి చేకూరిన లబ్దిని వివరించాలన్నారు. శ్వేత పత్రాలపై చర్చజరగాలన్నారు.
ప్రజా చైతన్యమే లక్ష్యంగా..
నేటి నుంచి ఆరో విడత జన్మభూమి
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్రణాళిక
జన్మభూమి మండల స్థాయి అధికారులతో కూడిన బృందాలు గ్రామ సభలు నిర్వహించడంతో పాటు ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కాలినడక పర్యటన పర్యవేక్షించడం, గ్రామాభివృద్ధి ప్రణాళిక అమలును సమీక్షించడం, అర్జీల పరిష్కారంపై దృష్టి సారించడం చేయనున్నారు. గ్రామస్థాయి అధికారుల (ప్రోగ్రాం మేనేజ్మెంట్ కమిటీ)తో కూడిన బృందాలు ప్రభుత్వం ఇటీవల పది అంశాల పరంగా విడుదల చేసిన శ్వేత పత్రాల గురించి రోజుకొకటి చొప్పున ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటారు.
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి- మాఊరు ఆరో విడత కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలను చైతన్యపరిచేలా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను క్షుణ్ణంగా క్షేత్రస్ధాయిలో వివరించడంతో పాటు ప్రజా సంతృప్తిని మరింత పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించారు.
జిల్లాలో ఇలా.. :
* జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకూ జన్మభూమి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.
* ఇప్పటి వరకూ ఐదు విడతల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్ల నిర్మాణం వంటి వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చేందుకు, సంక్షేమ శాఖల ద్వారా మంజూరు చేసే రుణాలు, ఉపకరణాల పంపిణీకి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.
* గడచిన ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో గ్రామ వికాసం, కుటుంబ వికాసాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామసభల ద్వారా గుర్తించిన ప్రాధాన్యతాపరమైన సమస్యలతో పాటు ఆర్థికేతర అంశాల తక్షణ పరిష్కార చర్యలపై దృష్టి సారించారు. ఇంతకు ముందు వరకూ జరిగిన జన్మభూమి కార్యక్రమాల ద్వారా అవసరం మేరకు రేషన్ కార్డులు, ఫించన్లు, ఇళ్ల స్థలాలు తదితరాలు పంపిణీ చేశారు.
* గతానికి భిన్నంగా ఇంకా అర్హులెవరైనా ఉంటే నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించారు.
* ప్రజల వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన అర్జీలు అంతగా వచ్చే అవకాశాలు లేవు. అరకొరగా అర్జీలు వచ్చిన వాటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికల లోపు ప్రస్తుతం నిర్వహించే జన్మభూమి కార్యక్రమమే ఆఖరిదిగా భావిస్తున్న కారణంతో ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించడమే ప్రస్తుత జన్మభూమి ప్రధాన ఎజెండా కానుంది. గ్రామాల్లో రెండు బృందాలుగా పర్యటించే అధికార బృందాలు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, ప్రజాసంతృప్తి శాతంలో లోటు పాట్లును గుర్తించి, ఇంకా మెరుగు పర్చేలా దృష్టి సారించనున్నారు.
* గ్రామసభల్లో భాగంగా కుటుంబ వికాసానికి సంబంధించి సామాజిక, పోషకాహార, బీమా, విద్యుత్తు, ఆరోగ్య, నీటి, గృహ, విద్యా, ఉపాధి, వ్యక్తిగత, జీవనోపాధి తదితర భద్రతల కల్పన, సమాజ వికాస పరంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సేవారంగం, మౌలికవసతుల కల్పన, పౌరసేవలు, సమగ్రాభివృద్ధి తదితర అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు చేపడతారు. గ్రామసభ నిర్వహించే రోజు ఆయా గ్రామాల్లో ఆరోగ్య, పశువైద్య, క్యాంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
* జన్మభూమి కార్యక్రమ ముగింపు రోజైన 11వ తేదీన ప్రతి చోటా సాంస్కృతిక కార్యక్రమాలు, డిబేట్, వ్యాసరచన, చిత్రలేఖనం, రంగవల్లుల పోటీలు నిర్వహించనున్నారు.
రారండోయ్..! ‘జన్మభూమి’కి రావాలని మహిళలకు పిలుపు
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఈ నెల రెండో తేదీ నుంచి 11 వరకూ నిర్వహించనున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ గ్రామ పంచాయతీ తరుపున సాధికార మిత్రలు, వెలుగుసిబ్బంది ఇల్లిల్లు తిరిగి మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. మరో వంక పింఛనర్ల ఇళ్ల తలుపులకు స్టిక్కర్లను అతికిస్తున్నారు. నగరంలోని విడిది కార్యాలయానికి మంగళవారం వచ్చిన పంచాయతీ అధికారులను, కార్యదర్శులను కలెక్టరు బి.లక్ష్మీకాంతం ఈ విషయమై ఆరా తీశారు. దీంతో ఇబ్రహీంపట్నం మూలపాడు పంచాయతీలో ఇవి అమలు జరుగుతున్నట్లు కార్యదర్శి కొత్తా శ్రీనివాసరావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
తరలుదాం రండి.. జన్మభూమికి
నేటి నుంచి గ్రామాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు!
చివరి రోజు బందరులో సీఎం సభ
గ్రామ, వార్డుల్లో సాంస్కృతిక, ముగ్గుల పోటీలు
వచ్చే అయిదేళ్లకు అభివృద్ధి ప్రణాళికలు
ఈనాడు, విజయవాడ
మరో అయిదు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార గణం, ప్రజాప్రతినిధులు గ్రామబాట పట్టనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘జన్మభూమి – మావూరు’ ఆరోవిడత బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విశ్లేషణతోపాటు ప్రణాళికలు రూపొందించడం ఈ సారి ప్రత్యేకత. సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. బుధవారం నుంచి 11 వతేదీ వరకు నిర్వహిస్తారు. చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రణాళిక ఖరారైనట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడించారు. బందరు నియోజకవర్గంలో సీఎం పాల్గొనే అవకాశం ఉందని కలెక్టరు చెప్పారు. అదే రోజు కొన్ని శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేయాలనే ఆలోచన జిల్లాయంత్రాంగానికి ఉంది.
ఇలా నిర్వహణ.. తొలి రోజు అన్ని నియోజకవర్గాల్లో తప్పనిసరిగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలనేది ఆదేశం. మండల బృందాల పర్యవేక్షణలో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రతి ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి మరీ జన్మభూమి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఆ గ్రామ అభివృద్ధిపై ప్రచురించిన కరపత్రాలను ప్రతిఇంటికీ పంచి పెడుతున్నారు. ఆహ్వాన పత్రాలు అంటించి వస్తున్నారు.
* గత నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను గ్రామసభలో వివరిస్తారు. శాఖల వారీగా సాధించిన ప్రగతిని వివరిస్తారు. గ్రామ అభివృద్ధిని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తారు.
* మండల, పురపాలక, నగరపాలక స్థాయి బృందం ప్రతి రోజూ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తుంది. ముందుగా ప్రార్థన, అజెండా అంశాల ప్రకటన, అనంతరం ముఖ్యమంత్రి సందేశం ఉంటుంది. జన్మభూమి మావూరు ప్రతిజ్ఞ చేయిస్తారు.
* ప్రభుత్వం విడుదల చేసిన వివిధ శ్వేతపత్రాలపై చర్చిస్తారు. అనంతరం గ్రామాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. 2019-2024 అయిదేళ్ల కాలానికి ప్రణాళిక రూపొందిస్తారు. తాత్కాలిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు.
* జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై ఆర్టీజీ చేపట్టిన సర్వే గురించి చర్చిస్తారు. సంతృప్తి నివేదికను గ్రామంలో ప్రదర్శిస్తారు. కృష్ణా జిల్లాలో సంతృప్తి స్థాయి బాగున్నట్లు తేలింది. కార్యక్రమాల నిర్వహణతో పాటు పౌరసరఫరాలపై 86 శాతం సంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
* గత జన్మభూమి కార్యక్రమాల్లో అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు (ఏటీఆర్) నివేదికను చదివి వినిపిస్తారు. వివిధ శాఖలు సాధించిన ప్రగతి విజయాలతో పాటు ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు నిర్వహిస్తారు.
రేషన్ కార్డులు అందిస్తారు..!
కొత్త రేషన్ కార్డులు ఈ కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోయి ఉంటే వారికి కొత్త కార్డులు పంపిణీ చేస్తారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఐఏఎస్, ఇతర సర్వీసుల వారిని నోడల్ అధికారులుగా నియమించారు. జిల్లాలో తొలి రోజు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం : బి.లక్ష్మీకాంతం, కలెక్టర్
జన్మభూమికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం చెప్పారు. రాబోయే కాలంలో ఇంకా ఏమేం చేపట్టాలనేదానిపై దార్శినికత ఉంటుందన్నారు. బృందాలకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామన్నారు..
చిన్నాపురం రానున్న ముఖ్యమంత్రి
పోర్టురోడ్డు: ఈనెల 11వ తేదీన చిన్నాపురం జన్మభూమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారని కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడించారు. అదేరోజున కృష్ణా విశ్వవిద్యాలయం నూతన భవనాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు అధికారగణం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఎంపీడీవో సూర్యనారాయణ మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేశారు.